Thimmapur: ఇంద్రనగర్ వద్ద అగ్నిప్రమాదం తృటిలో తప్పిన ప్రాణనష్టం

Thimmapur: కరీంనగర్ నుండి సిద్దిపేటకు ప్రయాణికులతో వెళ్తున్న టాటా ఏసీ ఆటోలో అగ్నిప్రమాదం జరిగింది.

Update: 2026-04-03 15:24 GMT

Thimmapur: ఇంద్రనగర్ వద్ద అగ్నిప్రమాదం తృటిలో తప్పిన ప్రాణనష్టం

Thimmapur: కరీంనగర్ నుండి సిద్దిపేటకు వెళ్తున్న టాటా ఏసీ తిమ్మాపూర్ మండలం ఇంద్రనగర్ వద్ద మంటల్లో కాలిపోయింది. టాటా ఏస్ ఆటో ప్రయాణికులతో సిద్దిపేటకు వెళుతుండగా ఇంజన్లో పొగలు రావడంతో డ్రైవర్ హైమద్ పాషా ఇంద్రనగర్ వద్ద ఆటోను పక్కకు ఆపి అందులోని ప్యాసింజర్లను దించాడు.

ఇంజన్లో పొగలు రావడంతో డ్రైవర్ పరిశీలిస్తుండగా మంటలు ఎక్కువయ్యాయి. వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి కు సమాచారం అందించారు. కరీంనగర్ నుండి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పేసింది. ఆటో పూర్తిగా కాలిపోయిందని డ్రైవర్ అహ్మద్ పాషా తెలిపారు.

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్ద కోడూరు చెందిన అహ్మద్ పాషా తో పాటు ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

Tags:    

Similar News