Cyber Crime: అంతర్జాతీయ బ్యాంక్ ఖాతాల కొల్లగొట్టిన ముఠా గుట్టురట్టు

Cyber Crime: సత్తుపల్లి అంతర్జాతీయ సైబర్ క్రైమ్ కేసులో ముగ్గురు బ్యాంక్ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2026-04-03 15:40 GMT

Cyber Crime: అంతర్జాతీయ బ్యాంక్ ఖాతాల కొల్లగొట్టిన ముఠా గుట్టురట్టు

Cyber Crime: అంతర్జాతీయ స్థాయిలో బ్యాంక్ ఖాతాలను కొల్లగొట్టి రాష్ట్రస్థాయిలో సంచలనాత్మకంగా నిలిచిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి సైబర్ క్రైమ్ కేసులో ముగ్గురు బ్యాంకు సిబ్బందిని గురువారం అరెస్టు చేసినట్లు ఏసిపి వసుంధర యాదవ్ గురువారం విలేకరులకు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముష్టిబండ గ్రామానికి చెందిన ఉడతనేని వికాస్ చౌదరి సత్తుపల్లి పట్టణానికి చెందిన తన భార్య బొప్పన నాగప్రియ లు ప్రధాన సూత్రధారులుగా ఫిబ్రవరి 23 తేదీ న సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశారు. ఆ రోజు ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేయగా విచారణలో మొత్తం 26మందిని గుర్తించి ఈ రోజు మరో ముగ్గురు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.

ఈ మేరకు ఏసిపి వసుంధర యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో బ్యాంక్ లావాదేవీలకు సహకరించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండల కేంద్రంలో గల

కాథలిక్ సిరియన్ బ్యాంక్ (సి ఎస్ బి)లో కస్టమర్ రిలేషన్ ఆఫీసర్స్ గా పనిచేసే బెండాలపాడు గ్రామానికి చెందిన ఓర్సు కృప, పెనుబల్లి మండలం బవన్నపాలెం గ్రామానికి చెందిన మందా శ్రీహారి బాబు తో పాటు మద్దుకూరు గ్రామానికి చెందిన బ్రాంచ్ ఆపరేషన్ మేనేజర్ జుంజునూరి రాధ క్రిష్ణ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ తుమ్మలపల్లి శ్రీహరి తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న నేరస్థుల గురించి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ఏసిపి తెలిపారు.

కాంబోడియా.. ఆస్ట్రేలియా లలో భాదితులు..

సత్తుపల్లి ప్రాంతానికి చెందిన సైబర్ నేరగాళ్లు ఇండియాతో పాటు కంబోడియా, ఆస్ట్రేలియా, నైజీరియా దేశాలకు చెందిన పౌరుల బ్యాంకు ఖాతాలను వివిధ మార్గాల్లో కొల్లగొట్టి ఆ నగదును హవాలా ద్వారా దారి మరణించినట్లు పోలీసులు విచారణలో తేలింది. సన్నిహితులు, మిత్రుల ద్వారా ఇతర దేశాల్లో ఉన్న పౌరుల బ్యాంకు ఖాతాలు వివరాలు తెలుసుకొని వారికి మాట్రిమోనీ రివార్డు పాయింట్లు ఆన్లైన్ గేమింగ్ ట్రేడింగ్ బెట్టింగ్ పేరుతో ఆకర్షించి

అలా ఆకర్షితులైన వారందరినీ టెలిగ్రామ్ గ్రూపులో సభ్యులుగా చేర్చుకొని వారి ఖాతాలను కొల్లగొట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. కొంతమంది నిరుద్యోగ యువకులను ఉద్యోగం పేరుతో వారి బ్యాంకు ఖాతాల యూజర్ ఐడి, పాస్వర్డ్ లను తీసుకొని వారికి తెలియకుండానే వారి ఖాతాలను ఆపరేట్ చేస్తూ ఈ కేసులో వారిని కూడా నిందితులుగా మార్చినట్లు కొందరు బాధితులు వాపోవడం విశేషం. మరి కొంతమందికి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు ఆశ చూపి వారి బ్యాంకు ఖాతాలు వాడుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

కేవలం 2 నుంచి 3 ఏళ్ల వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తం నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకుని, వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టడం ఆశ్చర్యకరమని పలువురు వాపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారంతా 30 నుంచి 35 ఏళ్ల వయస్సు లోబడిన యువకులే కావడం విశేషం. వ్యసనాలకు అలవాటు పడి ఈజీ మనీ వైపు ఆకర్షితులై ఇటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుకు ముందు సత్తుపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో మొదటి సైబర్ క్రైమ్ కేసు నమోదు కాగా మరో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తుపల్లి స్టేషన్ లో రెండవ కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు.

Tags:    

Similar News