Peddapalli: సూరయ్యపల్లి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు

Peddapalli: పెద్దపల్లి జిల్లా మంథని మండలం సూరయ్యపల్లి, శ్రీపాద కాలనీల్లో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.

Update: 2026-04-03 13:13 GMT

Peddapalli: సూరయ్యపల్లి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు

Peddapalli: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని సూరయ్యపల్లి, శ్రీపాద కాలనీ, మంథని పట్టణంలోని వివిధ చర్చిలలో గుడ్ ఫ్రైడే వేడుకలను క్రిస్టియన్ విశ్వాసులు ఘనంగా నిర్వహించుకున్నారు. స్లీవను ఏసుక్రీస్తు విశ్వాసులు భుజానమోస్తు ఏసుక్రీస్తు పడిన శ్రమలను కొనియాడారు. ఈ సందర్భంగా సూరయ్యపల్లి ఎస్టి జోసెఫ్ చర్చ్ ఫాదర్ తోమోస్ మాట్లాడుతూ.

గుడ్ ఫ్రైడే అనేది ప్రేమ, త్యాగం, క్షమ శిక్షణ అనే మహత్తర సందేశాన్ని మనకు తెలియజేసే పవిత్రమైన రోజు అన్నారు. ఈ రోజున యేసు క్రీస్తు మన పాపాల కొరకు తన ప్రాణాలను అర్పించి మనకు నిత్యజీవం మార్గాన్ని చూపించారన్నారు.

మనమూ ఈ రోజు ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ, ప్రేమను పంచుతూ, ఇతరులను క్షమిస్తూ, మంచి పనులు చేయాలని విశ్వాసులకు సందేశం ఇచ్చారు.

Tags:    

Similar News