Karimnagar: మద్యం తాగి వాహనం నడిపితే మృత్యువే.. కరీంనగర్ ప్రమాద ఘటనపై పోలీసుల హెచ్చరిక

Karimnagar: కరీంనగర్ బైపాస్ రహదారిపై అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు వెనుక నుండి బలంగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.

Update: 2026-04-03 06:22 GMT

Karimnagar: మద్యం తాగి వాహనం నడిపితే మృత్యువే.. కరీంనగర్ ప్రమాద ఘటనపై పోలీసుల హెచ్చరిక

కరీంనగర్: కరీంనగర్ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.

కరీంనగర్ బైపాస్ రహదారిపై అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఓ కారు వెనుక ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న నలుగురు యువకుల్లో ఇద్దరి యువకులు అక్కడికక్కడే మృతి. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపిన పోలీసులు.

ఈ సందర్భంగా పోలీసులు పలు సూచనలు చేశారు మద్యం తాగి వాహనాలు నడపకూడదు రోడ్డు పక్కన వాహనాలు నిలిపినప్పుడు వాటిని రోడ్డు కిందికి దించి నిలిపివేయాలని అతివేగంగా వాహనాలు నడపకూడదని సూచించారు.

అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాద ఘటన లారీని వెనుక నుండి గుద్దడం వల్ల జరిగిందని కారు నడిపిస్తున్న యువకుడు ముందున్న వాహనాన్ని గమనించకపోవడంతో ఘోర ప్రమాదం జరిగి ఇద్దరి యువకుల మృతికి కారణమైందన్నారు. రోడ్డు నిబంధనలు కచ్చితంగా వాహనదారులు పాటించాలని మద్యం తాగి అసలే వాహనాలు నడపకూడదని ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు.

Tags:    

Similar News