Karimnagar: ప్రజల ముంగిటకే పాలన ముత్యంపేట గ్రామసభలో ఎమ్మెల్యే సత్యం హామీ
Karimnagar: కరీంనగర్ జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలో జరిగిన ప్రజాపాలన గ్రామసభలో చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం పాల్గొన్నారు.
Karimnagar: ప్రజల ముంగిటకే పాలన ముత్యంపేట గ్రామసభలో ఎమ్మెల్యే సత్యం హామీ
కరీంనగర్ జిల్లా: చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలం ముత్యం పేట గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి శాసన సభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ గ్రామ సభలో ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే సత్యం వివరించారు. గ్రామ స్థాయిలో ప్రజలకు అందుతున్న సేవలు, అమలు అవుతున్న పథకాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రజలతో నేరుగా మాట్లాడటం ద్వారా వారి అవసరాలు, అభిప్రాయాలు తెలుసుకోవడం ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, అధికారులు, గ్రామస్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.