Karimnagar: మతసామరస్యానికి నిదర్శనం హనుమాన్ స్వాములకు ముస్లిం సోదరుల సేవ!
Karimnagar: హనుమాన్ స్వాములకు ముస్లిం సోదరుల అండ. గంగాధర మండలం వెంకటాయపల్లి వద్ద మహ్మద్ ఆసిఫ్ ఏర్పాటు చేసిన సేవా శిబిరం అందరినీ ఆకట్టుకుంటోంది.
Karimnagar: మతసామరస్యానికి నిదర్శనం హనుమాన్ స్వాములకు ముస్లిం సోదరుల సేవ!
Karimnagar: హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనార్థం పాదయాత్రగా వెళ్లే భక్తులకు మార్గమధ్యంలో అద్భుతమైన మానవతా దృశ్యం కనిపించింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామం వద్ద హనుమాన్ దీక్ష స్వాముల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సేవా శిబిరం అందరినీ ఆకట్టుకుంటోంది.
గ్రామ ఉప సర్పంచ్ మహ్మద్ ఆసిఫ్ ఆధ్వర్యంలో టెంటు ఏర్పాటు చేసి, నిన్నటి నుంచి ఈరోజు వరకు పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు అరటిపండ్లు, మజ్జిగ, చల్లని తాగునీరు అందిస్తున్నారు. ఎండలను లెక్కచేయకుండా భక్తులకు సేవలందిస్తున్న ఈ సేవా కార్యక్రమం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది.
వివిధ మతాలకు చెందిన ప్రజలు కలసి సేవ చేయడం ద్వారా మతసామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఈ ఘటనపై హనుమాన్ స్వాములు, స్థానిక ప్రజలు మహ్మద్ ఆసిఫ్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. నిజమైన మానవతా భావం అంటే ఇదేనని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.