Karimnagar: జర్నలిస్ట్ సంబోజి శేఖర్ మృతి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నివాళి

Karimnagar: చొప్పదండి సీనియర్ జర్నలిస్ట్ సంబోజి శేఖర్ హఠాన్మరణం పట్ల ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Update: 2026-04-03 06:29 GMT

Karimnagar: జర్నలిస్ట్ సంబోజి శేఖర్ మృతి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నివాళి

కరీంనగర్ జిల్లా: చొప్పదండి మండలంలో సీనియర్ జర్నలిస్ట్ సంబోజి శేఖర్ హఠాన్మరణం ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గుండెపోటుతో ఆయన ఆకస్మికంగా మృతి చెందడం పత్రికా రంగానికి తీరని లోటుగా మారింది. ఎన్నో సంవత్సరాలుగా జర్నలిజం రంగంలో సేవలందిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన సంబోజి శేఖర్ మరణవార్త తెలుసుకున్న వెంటనే స్థానిక ప్రజలు, సహచర జర్నలిస్టులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఈ సందర్భంగా చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం మృతుడి నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి. సంబోజి శేఖర్ సమాజానికి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ, ఆయన మరణం జర్నలిజం రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.

ఇక కుటుంబానికి అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, వారి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

సంబోజి శేఖర్ మృతి పట్ల పలు రాజకీయ, సామాజిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటనతో చొప్పదండి మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News