Kodangal Municipal Election Results 2026: కొడంగల్‌లో ‘హస్తం’ ప్రభంజనం: సీఎం సొంత గడ్డపై కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. మూడు మున్సిపాలిటీలు కైవసం!
Kodangal Municipal Election Results 2026: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది.
Kodangal Municipal Election Results 2026: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించి, ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు.
మున్సిపాలిటీల వారీగా ఫలితాలు:
1. కొడంగల్ మున్సిపాలిటీ (వికారాబాద్ జిల్లా):
సొంత పట్టణంలో కాంగ్రెస్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.
మొత్తం వార్డులు: 12
కాంగ్రెస్: 10
బీఆర్‌ఎస్: 01
MIM: 01
2. మద్దూర్ మున్సిపాలిటీ (నారాయణపేట జిల్లా):
మద్దూర్‌లో హోరాహోరీ పోరు సాగినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్‌ను దాటి పీఠాన్ని దక్కించుకుంది.
మొత్తం వార్డులు: 16
కాంగ్రెస్: 09
బీఆర్‌ఎస్: 06
ఇండిపెండెంట్: 01
3. కోస్గి మున్సిపాలిటీ:
కోస్గిలో కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగుతోంది. విపక్షాలు కనీసం ఖాతా తెరవని రీతిలో హస్తం అభ్యర్థులు దూసుకుపోతున్నారు.
మొత్తం వార్డులు: 16
ఇప్పటివరకు గెలిచినవి: 08 (కాంగ్రెస్)
బీఆర్‌ఎస్/బీజేపీ: 0
(గమనిక: ఇక్కడ ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది, కాంగ్రెస్ పూర్తి మెజారిటీ దిశగా ఉంది)
ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడంతో ఈ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అభివృద్ధి పనులే తమను గెలిపించాయని కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కొడంగల్ పట్టణంతో పాటు మద్దూర్, కోస్గిలలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.