Satavahana University: శాతవాహనలో ముగిసిన ఆహార విశ్లేషణపై కార్యశాల
Satavahana University: శాతవాహన విశ్వవిద్యాలయంలో 'ఆహార విశ్లేషణ పద్ధతులు' అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల కార్యశాల విజయవంతంగా ముగిసింది.
Satavahana University: శాతవాహనలో ముగిసిన ఆహార విశ్లేషణపై కార్యశాల
Satavahana University: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఆహార విశ్లేషణ పద్ధతులు అనే అంశంపై రెండు రోజులకార్యశాల ఘనంగా ముగియగా సభాదక్షులు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ రమాకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ కార్యశాలను బాగా వినియోగించుకున్నారని ఇలాంటి కార్యశాలలు ఇంకా జరగాలని అన్నారు.
ముఖ్యఅతిథిగా ఉపకులపతి ఆచార్య ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ ఆహార విశ్లేషణ పై జరిగిన ఈ కార్యశాల ఆహార పదార్థాల లక్షణాలను అధ్యయనం చేసే ప్రక్రియతో పాటు వివిధ రకాల పరిరక్షించే పద్ధతులను నేర్చుకోవటం మంచిదని దీనితో నాణ్యమైన ఆహారంతో పాటు పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని, ఈ ఆహార విశ్లేషణ వల్ల విద్యార్థులలో పరిశోదన పద్ధతులను నేర్చుకోవటమే ప్రధాన లక్ష్యమని, వివిధ రకాల ఆహార పదార్థాలను సేకరించి నిలువచేసే విషయాలపై సమగ్రమైన పరిశోధనలు జరగాలని తెలియజేస్తూ రెండు రోజుల కార్యశాల వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమన్నారు.
ఫుడ్ సైన్స్ విభాగాధిపతి, కార్యశాల కన్వీనర్ డాక్టర్ జోసఫ్ రాజు మాట్లాడుతూ ఈ కార్యశాల వల్ల ఆధునిక పద్ధతులలో ఆహారాన్ని ఎలా నిలువ చేయాలో నేర్చుకోవడం జరిగిందని ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరమైనదని అన్నారు. ఈ రెండు రోజుల కార్యశాలలో నగరంలోని ఎస్.ఆర్.ఆర్ కళాశాల విద్యార్థులు జగిత్యాల లోని గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులతో పాటు ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ విద్యార్థులు పాల్గొనగా వారికీ ప్రశంసా పత్రాలు అందజేయగా అధ్యాపకులు డాక్టర్ హరిత, మస్రత్, సాయిప్రియ ఆ కళాశాల అధ్యాపకులు డాక్టర్ సరసిజ, డాక్టర్ రాజు, డాక్టర్ కిరణ్, డాక్టర్ మధు, డా.అజయ్, డాక్టర్ రమేష్ రెడ్డి, డాక్టర్ నరసింహచారి, డాక్టర్ మల్లారెడ్డి, శ్రీ విద్య పాల్గొన్నారు.