Mallapur: వడ్ల నిల్వకు గోదాములను సిద్ధం చేయండి.. జిల్లా కలెక్టర్ ఆదేశం
Mallapur: జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మల్లాపూర్ మండలంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ గోదాములను పరిశీలించారు.
Mallapur: వడ్ల నిల్వకు గోదాములను సిద్ధం చేయండి.. జిల్లా కలెక్టర్ ఆదేశం
మల్లాపూర్: జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మల్లాపూర్ మండలం ముత్యం పేట గ్రామంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న గోదాములను పరిశీలించి, రాబోయే రబీ సీజన్‌కు సంబంధించి వడ్ల నిల్వకు అవి అనువుగా ఉన్నాయా లేదా అనే విషయంపై సమగ్రంగా పరిశీలించారు.
గోదాముల సామర్థ్యం, భద్రతా ప్రమాణాలు, తేమ నియంత్రణ వంటి అంశాలను పరిశీలిస్తూ, వడ్లను సురక్షితంగా నిల్వ చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా, మెట్టుపల్లి డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో వడ్లు నిల్వ చేయడానికి అనువైన గోదాములను గుర్తించాలని మెట్‌పల్లి ఆర్డీవో నరసింహ రావును ఆదేశించారు.
రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికలతో నిల్వ సదుపాయాలు సిద్ధం చేయాలని సూచించారు. రాబోయే రబీ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర చర్యలు తీసుకోవాలని, నిల్వ సదుపాయాలను బలోపేతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో మెట్టుపల్లి ఆర్డీవో నరసింహారావు, తహసీల్దార్, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.