Armoor: విజయ యాత్రలో ఉద్రిక్తత న్యూసెన్స్ చేసిన వ్యక్తులపై భక్తుల ఆగ్రహం
Armoor: ఆర్మూర్ పట్టణంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వీర హనుమాన్ విజయ యాత్రను ప్రారంభించారు.
Armoor: విజయ యాత్రలో ఉద్రిక్తత న్యూసెన్స్ చేసిన వ్యక్తులపై భక్తుల ఆగ్రహం
ఆర్మూర్ న్యూస్: పట్టణంలో వీర హనుమాన్ విజయ యాత్ర కొద్ది సేపటి క్రితం మామిడిపల్లి హనుమాన్ టెంపుల్ నుంచి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా రాముడు, హనుమాన్ విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు, అనంతరం మామిడిపల్లి చౌరస్తా దగ్గర ర్యాలీ ఒక అరగంట నడుస్తుండగానే, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తాగచ్చి, న్యూసెన్స్ చేయడంతో, ర్యాలీలో ఉన్న భక్తులు, రాలిని ఆపేసి జై శ్రీరామ్ అంటూ నినాదాలతో, మారు మోగించి యధావిధిగా ర్యాలీతో ముందుకు సాగారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, విజయాత్రను, ప్రశాంతంగా కొనసాగుతున్న దాన్ని, ఎవరు కూడా డిస్టర్బ్ చేయవద్దు, ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, ఈ ర్యాలీ నీ యధావిధిగా అంబేద్కర్ చౌరస్తా నుంచి పెద్ద బజార్ వరకు ప్రశాంతంగా కొనసాగాలంటూ రాకేష్ రెడ్డి మాట్లాడడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బిజెపి నాయకులు, ఇతర పార్టీ నాయకులు కౌన్సిలర్లు, ఫౌండేషన్, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.