Hyderabad 2025 Highlights: 2025లో హైదరాబాద్ హోరెత్తింది.. దేశం మొత్తం మాట్లాడుకున్న ఈవెంట్ల జాబితా

2025కు వీడ్కోలు పలుకుతున్న ఈ వేళ హైదరాబాద్ మరింత ఉత్సాహంగా, జీవంతంగా కనిపిస్తోంది. ప్రపంచ స్థాయి ఈవెంట్ల నుంచి సంస్కృతి పండుగల వరకూ..

Update: 2025-12-29 09:21 GMT

Hyderabad 2025 Highlights: Biggest Events and Mega Moments That Stole the Show

2025కు వీడ్కోలు పలుకుతున్న ఈ వేళ హైదరాబాద్ మరింత ఉత్సాహంగా, జీవంతంగా కనిపిస్తోంది. ప్రపంచ స్థాయి ఈవెంట్ల నుంచి సంస్కృతి పండుగల వరకూ..ఈ ఏడాది మన నగరం తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించింది. పెద్ద స్టార్‌లు, ప్రతిష్ఠాత్మక సదస్సులు..ఏదైనా సరే, హైదరాబాద్ అంటే క్లాస్ అని మరోసారి నిరూపించింది. 2026 మరింత గొప్పగా ఉండాలని ఆశిస్తూ, 2025లో హైదరాబాద్ చూసిన మెగా క్షణాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

2025లో హైదరాబాద్‌లో జరిగిన అతిపెద్ద ఈవెంట్లు

1. ప్రపంచ వేదికపై హైదరాబాద్: మిస్ వరల్డ్ 2025

మే నెలలో HITEX వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడంతో హైదరాబాద్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. 100కిపైగా దేశాల అందగత్తెలు చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్ వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించగా—‘సిటీ ఆఫ్ పెర్ల్స్’ తన శోభను, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చాటింది.

2. రికార్డు స్థాయి బతుకమ్మ వేడుక

సెప్టెంబరులో జరిగిన బతుకమ్మ వేడుకలు చరిత్ర సృష్టించాయి. సరూర్‌నగర్ స్టేడియంలో 63 అడుగుల ఎత్తైన పూల బతుకమ్మను నిర్మించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో రెండు రికార్డులు సాధించారు. వేలాది మహిళలు పూల మధ్య నృత్యాలు చేస్తూ తెలంగాణ సంస్కృతిపై గర్వాన్ని చాటారు.

3. సల్మాన్ ఖాన్‌తో హై-ఆక్టేన్ థ్రిల్స్

డిసెంబర్ 6న గచ్చిబౌలిలో జరిగిన ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ (ISRL) ఈవెంట్ నగరాన్ని ఉర్రూతలూగించింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హాజరుకావడంతో రేసింగ్ ఈవెంట్ ఓ పెద్ద సెలబ్రేషన్‌గా మారింది. అంతర్జాతీయ బైకర్లు చేసిన విన్యాసాలు అభిమానులను మంత్రముగ్ధులను చేశాయి.

4. మెస్సీ మ్యాజిక్: హైదరాబాద్‌కు ప్రపంచ ప్రశంసలు

2025లో అత్యంత సంచలన క్షణం, ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రావడం. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్ అద్భుతంగా నిర్వహించబడింది. అంతర్జాతీయ మీడియా సైతం హైదరాబాద్ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ను ప్రశంసించింది. అభిమానులతో మెస్సీ కలిసిమెలిసి గడిపిన క్షణాలు మరపురానివి.

5. మ్యూజిక్‌తో మత్తెక్కిన సంవత్సరం

2025కి ఓ సౌండ్‌ట్రాక్ ఉంటే అది సూపర్‌హిట్‌నే. ఎడ్ షీరన్ గిటార్ మ్యూజిక్‌తో మంత్రముగ్ధులను చేయగా, DJ స్నేక్ నగరాన్ని డ్యాన్స్ ఫ్లోర్‌గా మార్చాడు. సోనూ నిగమ్, శ్రేయ ఘోషల్, అర్మాన్ మాలిక్ పాటలతో సంగీత ప్రియులు మురిసిపోయారు. చివరగా ఏఆర్ రెహమాన్ సింఫోనిక్ నైట్‌తో ఏడాదిని అద్భుతంగా ముగించారు.

6. తెలంగాణ రైజింగ్: భవిష్యత్తు దిశగా అడుగులు

భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో 2025 అత్యంత శక్తివంతంగా ముగిసింది. ప్రపంచ నేతలు, భారీ పెట్టుబడులు హైదరాబాద్‌ను టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా మరింత బలపరిచాయి.

2025కి వీడ్కోలు పలుకుతున్న వేళ హైదరాబాద్ మరింత ఉత్సాహంగా కనిపిస్తోంది. పెద్ద ఈవెంట్లను సులువుగా నిర్వహించగల నగరమని ప్రపంచానికి నిరూపించాం. 2026 ఇంకా గొప్పగా ఉండాలని ఆశిస్తూ,హైదరాబాద్‌కు శుభాకాంక్షలు!

Tags:    

Similar News