Kamareddy: కామారెడ్డిలో హై టెన్షన్.. ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మరియు కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు ఉద్రిక్తతకు దారితీశాయి. ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్, కాంగ్రెస్ నేతల అరెస్టులతో పరిస్థితి రణరంగంగా మారింది.

Update: 2026-02-21 06:27 GMT

Kamareddy: కామారెడ్డిలో హై టెన్షన్: సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. కారు ధ్వంసం..

Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వర్గాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పరస్పర దాడులు, అరెస్టులతో కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

స్థానిక సమస్యలు, రాజకీయ విమర్శల నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకున్నారు. దీంతో సరస్వతి శిశుమందిర్ స్కూల్ వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకోవడంతో హై టెన్షన్ మొదలైంది. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని ఆయన క్యాంప్ కార్యాలయంలోనే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బయటకు రాకుండా భారీగా బలగాలను మోహరించారు.

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత పరాకాష్టకు చేరింది. ఆందోళనల క్రమంలో ఒక కారు అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పలువురు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ప్రస్తుతం కామారెడ్డిలో 144 సెక్షన్ తరహాలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Tags:    

Similar News