"జీవన్ రెడ్డికి అవమానం జరగనివ్వకండి".. అధిష్ఠానానికి జగ్గారెడ్డి బహిరంగ విజ్ఞప్తి!
Jagga Reddy: కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడైన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి విషయంలో పార్టీ హైకమాండ్ చొరవ తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
"జీవన్ రెడ్డికి అవమానం జరగనివ్వకండి".. అధిష్ఠానానికి జగ్గారెడ్డి బహిరంగ విజ్ఞప్తి!
Jagga Reddy: కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడైన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి విషయంలో పార్టీ హైకమాండ్ చొరవ తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులకు తగిన గౌరవం దక్కాలని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రాజకీయ ఆఫర్లు వచ్చినా జీవన్ రెడ్డి పార్టీని వీడలేదని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఓటమి ఎదురైనా ఆయన పార్టీ జెండానే పట్టుకుని ఉన్నారని కొనియాడారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సీనియర్ నాయకుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానం జరగకుండా, ఆయన అనుభవానికి తగ్గ గౌరవం కల్పించాలని జగ్గారెడ్డి మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, జీవన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఆయన అనారోగ్యానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం వైద్యులు ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సొంత పార్టీ నేతలే జీవన్ రెడ్డికి మద్దతుగా గళమెత్తడం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.