Fire Accident: అమీర్‌పేట మైత్రీవనంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

Fire Accident: నగరంలోని కీలక ప్రాంతమైన అమీర్‌పేటలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2026-02-20 06:23 GMT

Fire Accident: అమీర్‌పేట మైత్రీవనంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

Fire Accident: నగరంలోని కీలక ప్రాంతమైన అమీర్‌పేటలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మైత్రీవనంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగడంతో స్థానికులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ప్రమాదం జరిగిన సమయంలో సదరు అపార్ట్‌మెంట్‌లోని కోచింగ్ సెంటర్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. మంటలు అపార్ట్‌మెంట్ అంతటా వేగంగా వ్యాపించడంతో విద్యార్థులు బయటకు రాలేక లోపలే చిక్కుకుపోయారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానిక యువకులు, పోలీసులు కలిసి ప్రాణాలకు తెగించి విద్యార్థులను అపార్ట్‌మెంట్ నుంచి క్షేమంగా బయటకు తరలించారు. ఈ క్రమంలో విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పెను ప్రమాదం తప్పింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Tags:    

Similar News