Harish Rao: అధికారులకు హరీష్ రావు సీరియస్ వార్నింగ్!

Harish Rao: తెలంగాణలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు.

Update: 2026-02-19 10:10 GMT

Harish Rao: అధికారులకు హరీష్ రావు సీరియస్ వార్నింగ్!

Harish Rao: తెలంగాణలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న బీఆర్ఎస్ నేతలను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయం గురించి ప్రశ్నిస్తే అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి బాల్క సుమన్ సహా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆయన ధ్వజమెత్తారు.

క్యాతన్ పల్లి మున్సిపల్ సమావేశంలో ప్రజా తీర్పును కాంగ్రెస్ అగౌరవపరిచిందని హరీష్ రావు ఆరోపించారు. "బీఆర్ఎస్‌కు 14 మంది కౌన్సిలర్ల మెజారిటీ ఉన్నా.. మంత్రి వివేక్ సమక్షంలోనే మహిళా కౌన్సిలర్లను అవమానించారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు మద్యం మత్తులో వచ్చి గందరగోళం సృష్టించారు. ఎన్నికల అధికారులు మంత్రి కనుసన్నల్లో పనిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు" అని ఆయన విమర్శించారు.

రాహుల్ గాంధీ గారూ.. ఇదేనా మీ రాజ్యాంగం?

కాంగ్రెస్ అధిష్టానంపై కూడా హరీష్ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. "రాహుల్ గాంధీ గారూ.. మీరు చేతిలో పట్టుకునే రాజ్యాంగం ఇదేనా? మీనాక్షి నటరాజన్ గారూ.. మీ గాంధేయవాదం ఏమైంది? పోలీసు లాఠీల మధ్య ఎన్నికలు నిర్వహించడం సిగ్గుచేటు" అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేయడానికే పోలీసు కవాతులు నిర్వహించారని ఆయన ఆరోపించారు.

చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై హరీష్ రావు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. "అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. నిబంధనలు మీరిన అధికారులు భవిష్యత్తులో చట్టపరంగా మూల్యం చెల్లించక తప్పదు. ఎస్సీ, ఎస్టీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టడం విడ్డూరంగా ఉంది" అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య అంతర్గత మైత్రి కొనసాగుతోందని, అందుకే వారి నేతలపై ఎలాంటి అరెస్టులు ఉండవని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, తప్పు చేసిన అధికారులు మరియు ఎన్నికల కమిషన్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News