Medak: రేషన్ షాపులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
Medak: మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లా కేంద్రంలోని ఫతేనగర్ ప్రాంతంలో రేషన్ షాపులను తనిఖీ చేశారు.
Medak: రేషన్ షాపులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
మెదక్: జిల్లాలో చౌక దుకాణాల పనితీరు ఆదర్శంగా ఉందని నిత్యావసర వస్తువుల పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం.క్షేత్రస్థాయిలో కనపడుతుందని,పిడీఎస్ ప్రయోజనాలు పారదర్శకంగా, సమర్థవంతంగా ఉద్దేశించిన లబ్ధిదారులకు చేరేలా చూడటం కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు ఎలాంటి వదంతులు అసత్య ప్రచారాలు నమ్మకుండా,
ప్రశాంతంగా తమకు లభ్యమయ్యే మూడు నెలల రేషన్ ఈ నెల 30 వరకు పొందాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఫతేనగర్ ప్రాంతంలో షాప్ నెంబర్ -04 చౌక ధరల దుకాణాన్ని కలెక్టర్ తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, పౌరసరఫరాల ఇన్స్పెక్టర్ నరసింహులు, సిబ్బంది నాగరాజు, తో కలిసి ఆదివారం ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ స్టాక్ ను తూకాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు లబ్ధిదారులతో సంభాషించారు. చౌక ధరల దుకాణాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని లబ్ధిదారులు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువుల పంపిణీ జరగాలని ఆదేశించారు. లబ్ధిదారులు లేవనెత్తిన ఏవైనా సమస్యలు లేదా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.