Karimnagar: సిద్దాంతమే బీజేపీ బలం.. కేంద్ర మంత్రి బండి సంజయ్!

Karimnagar: భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్‌లోని తన నివాసంపై పార్టీ జెండాను ఎగురవేశారు.

Update: 2026-04-05 15:21 GMT

Karimnagar: సిద్దాంతమే బీజేపీ బలం.. కేంద్ర మంత్రి బండి సంజయ్!

కరీంనగర్: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంటిపై పార్టీ జెండాను ఎగరేసిన కేంద్ర మంత్రి.బీజేపీ కార్యకర్తలందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్. భారతీయ జనతా పార్టీ వరుసగా మూడుసార్లు అధికారంలోకి రావడంతోపాటు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడానికి ప్రధాన కారణం పార్టీ సిద్దాంత బలమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.

అట్టడుగునున్న చిట్ట చివరి పేదవాడికి సైతం అభివ్రుద్ధి, సంక్షేమ ఫలాలు అందించాలనే బీజేపీ అంత్యోదయ సిద్ధాంతమని, వాటిని తూ.చ తప్పకుండా అమలు చేస్తున్న మహానేత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు బండి సంజయ్ కుమార్ ఈరోజు ఉదయం తన నివాసంపై పార్టీ జెండాను ఎగరేశారు. రేపు (ఏప్రిల్ 6) బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ కార్యకర్తలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలన్నదే బీజేపీ సిద్దాంతం..

‘‘2 సీట్లతో మొదలైన బీజేపీ ప్రస్థానం నేడు నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్రంలో 12 ఏళ్లుగా అప్రతిహత పాలన కొనసాగుతోంది. 2 సీట్లతో ఏం సాధిస్తారని వెక్కిరించిన పార్టీలే బీజేపీ దెబ్బకు కాలగర్భంలో కలిశాయి. దీనికి కారణం బీజేపీ సిద్ధాంత బలం, జాతీయవాద భావాలే. చిట్ట చివరి పేదవాడి వరకు ప్రభుత్వ పథకాలు అందించాలనే పండిట్ దీన్ దయాళ్ అంత్యోదయ సిద్దాంతాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మోదీదే’’అని తెలిపారు.

2047 నాటికి భారత్ ను ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మార్చాలన్నదే మా లక్ష్యం..

ప్రధాని నరేంద్రమోదీ పాలనా విజయాలను ప్రస్తావిస్తూ. ‘‘ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ప్రజలకు స్వాతంత్య్రం అందించారు. అయోధ్య రామ మందిర నిర్మాణంతో కోట్లాది హిందువుల ఆకాంక్షను నెరవేర్చారు. ట్రిపుల్ తలాఖ్ రద్దు, సీఏఏ, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం వంటి విప్తవాత్మక చర్యలు తీసుకున్న ఘనత కూడా మోదీ ప్రభుత్వానిదే.

ఆపరేషన్ సింధూర్, సర్జికల్ స్ట్రయిక్స్ తో శత్రుదేశాల వెన్నులో వణుకు పుట్టించిన నేత మోదీ’’అని పేర్కొన్నారు. 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుండి బయట పడేయడమే కాకుండా దేశ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న నేత మోదీ’’అని కొనియాడారు. 2047 నాటికి భారత్ ను ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా మార్చాలనే ధ్రుఢ సంకల్పంతో మోదీ ప్రభుత్వం చేస్తున్న క్రుషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

Tags:    

Similar News