Choppadandi: ముసాయిదా బిల్లుపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది?
Choppadandi: కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని భక్తు విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
Choppadandi: ముసాయిదా బిల్లుపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది?
Choppadandi: కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని బి ఆర్ ఎస్ యువజన విభాగం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఉపాధ్యక్షులు భక్తు విజయ్ కుమార్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలను ఆగం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల మీద ఈ ప్రభుత్వానికి అంత ప్రేమెందుకని నిలదీశారు. మహిళా బిల్లు కోసం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించినప్పుడు లక్షలాది మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు న్యాయం చేసేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఎందుకు నిర్వహించటం లేదని ప్రశ్నించారు.
వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని కోరారు.దీనిపై తెలంగాణ విద్యా కమిషన్ ముసాయిదా బిల్లు సిద్దం చేసి నెలలు గడుస్తున్నా ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీపై ముఖ్యమంత్రి గారు ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. పేదలు,మధ్య తరగతి ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించటం కచ్చితంగా వారిని మోసం చేయటమేనని అన్నారు.
ముసాయిదా బిల్లు సిద్ధమైన తర్వాత కూడా భారీ ఎత్తున కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజులు పెంచాయని గుర్తు చేశారు. సామాన్య ప్రజలు ఫీజులు చెల్లించలేక ఆగమవుతుంటే ప్రభుత్వం మాత్రం ఈ బిల్లును అటకెక్కించిందని మండిపడ్డారు. కార్పొరేట్ విద్యా సంస్థల లాబీతో ప్రభుత్వానికి లాలూచీ ఏంటనీ ప్రశ్నించారు.వారితో ఏవైనా ఒప్పందాలు ఉన్నాయా?
లేదంటే రహస్య అజెండా ఉందా చెప్పాలని నిలదీశారు. ఫీజుల దోపిడీ కారణంగా సామాన్య కుటుంబాల జీవితకాలపు పొదుపు మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.