Telangana Budget 2026: ఆరు గ్యారంటీలు, పెన్షన్ల పెంపుపై క్లారిటీ.. ఫిబ్రవరి 28న సభలో భట్టి విక్రమార్క బడ్జెట్!
Telangana Budget 2026: ఈ నెలలో జరగనున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలను వెల్లడించనుంది.
Telangana Budget 2026: ఆరు గ్యారంటీలు, పెన్షన్ల పెంపుపై క్లారిటీ.. ఫిబ్రవరి 28న సభలో భట్టి విక్రమార్క బడ్జెట్!
Telangana Budget 2026: ఈ నెలలో జరగనున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలను వెల్లడించనుంది. ఈనెల 26 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం, మరుసటి రోజు గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగనుంది. ఈసారి సభను 10 నుంచి 15 రోజులపాటు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయాత్నిస్తుంది. ఈనెల 28న ఆర్థిక మంత్రి హోదాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ రూపకల్పనపై ఇప్పటికే మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాఖల వారీగా ప్రీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించి, మంత్రులు, అధికారులతో సమీక్షించారు.
ఈ బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేయనున్నంది. ఆరు గ్యారంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా కొత్త సంక్షేమ పథకాలు, నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి అంశాలపైనా ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఎన్నికల సమయంలో హామి ఇచ్చిన పెన్షన్ల పెంపు విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలపై తుది నిర్ణయం తీసుకునున్నారు.
ఈ బడ్జెట్ సమవేశంలో ఇరిగేషన్ శాఖకు అధిక ప్రాధాన్యత ఇవ్వానున్నట్లు తెలుస్తోంది. గతేడాదిలో ఇరిగేషన్ శాఖకు 22 వేల కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఈ ఏడాది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 2500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తుంది. కాగా కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్, కొడంగల్ నారాయణపేట ప్రాజెక్ట్‌కు నిధులు విడుదల చేయల్సి ఉంది.అయితే కొడంగల్ నారాయణపేట ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు కుడా పూర్తి అయింది. దీంతో పాలమూరు జిల్లాకు దాదాపు 4 వేల కోట్లు అవసరమవుతాయనే అంచనాలున్నాయి. కరువు జిల్లా పాలమూరుకు నిధులు విడుదల చేస్తే జిల్లాలోని వేలాది ఎకరాలకు నీరు అందించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇటు సీతారామ, సీతమ్మ సాగర్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు వేయి కోట్లు, దేవాదులకు 450 కోట్లు, ఇతర ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి. వాటికి కూడా నిధులు కేటాయించాలని అధికారులు ఫ్రీ బడ్జెట్ సమావేశంలో ప్రతిపాదించారు. అయితే ఈ ఏడాది ప్రాజెక్టు పనులు, పెండింగ్ బిల్లులు ఉండడంతో 80 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ప్రతిపాదనలు చేసింది. కూలి మధ్యలోనే అగిపోయిన ఎస్ఎల్‌బీసీకి ఎట్టిపరిస్థితిలోనూ ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీని కోసం వేయి కోట్ల నిధులు కావాలని అధికారులు అంచనా వేశారు.కాగా ఇటీవల బ్లాస్టింగ్ పనులు మొదలయ్యాయి.