Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు యువతుల మృతి

Road Accident: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు యువతులు రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువాత పడ్డారు.

Update: 2025-12-29 07:07 GMT

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు యువతుల మృతి

Road Accident: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు యువతులు రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువాత పడ్డారు. తెలంగాణకు చెందిన పులఖండం మేఘనారాణి, కడియాల భావన కాలిఫోర్నియాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా గార్లకు చెందిన మేఘనారాణి (25), ముల్కనూరుకు చెందిన కడియాల భావన (24) మూడేళ్ల క్రితం ఎమ్మెస్ (MS) చదివేందుకు అమెరికా వెళ్లారు. చదువు పూర్తయిన తర్వాత ప్రస్తుతం వారు అక్కడ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు.

ఆదివారం వీరు మరో ఆరుగురు స్నేహితులతో కలిసి రెండు కార్లలో కాలిఫోర్నియా పర్యటనకు బయలుదేరారు. అలబామా హిల్స్‌ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో, ఒక ప్రమాదకరమైన మలుపు వద్ద మేఘన, భావన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మేఘన, భావన మరణవార్త తెలియగానే మహబూబాబాద్, ముల్కనూరులోని వారి స్వగ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కన్నబిడ్డలు ప్రయోజకులవుతారని ఆశించిన తల్లిదండ్రులు, వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయాలని కన్నీరుమున్నీరవుతున్నారు.

Tags:    

Similar News