Corona Fear in Political Leaders: ప్రజాప్రతినిధులను వెంటాడుతోన్న కరోనా భయం

Corona Fear in Political Leaders: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. పెరుగుతున్న కేసులు జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కంటికి కనిపించని ఆ మహమ్మారికి చిన్న పెద్ద తేడా లేదు

Update: 2020-07-20 09:13 GMT
telangana updates

Corona Fear in Political leders : కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. పెరుగుతున్న కేసులు జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కంటికి కనిపించని ఆ మహమ్మారికి చిన్న పెద్ద తేడా లేదు. ధనిక, పేద అన్న బేదం లేదు. సామాన్యులు, సెలబ్రెటీల హోదా అవసరం లేదు. అందరిని వెంటాడుతోంది. వేధిస్తోంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొందరు పాలకులు కూడా కరోనా బారి నుంచి తప్పించుకోలేకపోయారు. దీంతో రాజకీయ నాయకులంతా జనాలను కలవాలంటేనే దడుసుకుంటున్నారు.

ఏపీ రాజకీయ నాయకులను కరోనా వైరస్ వెంటాడుతోంది. ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ అంజద్ బాషా, ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, కళావతి, రోశయ్య, శిల్పాచక్రపాణి రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. మరోవైపు నాయకుల కుటుంబాలను వారి సిబ్బందిని కూడా కరోనా వైరస్ వదిలిపెట్టలేదు. వారంతా బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. మంత్రి కృష్ణదాస్, ఎమ్మెల్యేలు చిట్టిబాబు, రోజా, బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు కూడా కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇటు తెలంగాణ పొలిటికల్ లీడర్స్ ను కూడా కరోనా గడగడలాడిస్తోంది. అధికార, విప్లక్ష పార్టీలన్న తేడా లేకుండా అందరిని కలవరపెడుతోంది కరోనా వైరస్. ఇప్పటికే అధికార పార్టీ టీఆర్ఎస్ లో నలుగురు ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్త, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గొంగిడి సునీత కరోనా బారినపడి కోలుకున్నారు. ఇటు హోమంత్రి మహ్మద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మరావు ను కూడా కరోనా వణికించింది.

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని కూడా కరోనా వదలలేదు. ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు, పార్టీ కోశాధికారి గూడురు నారాయణ రెడ్డికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డికి వైరస్ సోకింది. వీరంతా ఆస్పత్రుల్లో చికిత్స పొంది, కరోనాను జయించారు. కొందరు తెలంగాణ పొలిటికల్ లీడర్స్ కరోనా బారినపడిన పడడంతో నాయకుల్లో భయాందోళన మొదలైంది. చాలా మంది నాయకులు ప్రజలతో డైరెక్ట్ మీటింగ్ లను రద్దు చేసుకుంటున్నారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే అన్ని జాగ్రత్తలను పాటిస్తూ జనాల ముందుకు వస్తున్నారు.

 

Tags:    

Similar News