Hyderabad: పిల్లి తెచ్చిన తంటా: పోలీస్ స్టేషన్‌కు చేరిన పెంపుడు పిల్లి సర్జరీ వివాదం!

Hyderabad: హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన శాంభవిదేవి అనే మహిళ గత మూడేళ్లుగా ఒక మగ 'పెర్షియన్ పిల్లి'ని (Persian Cat) పెంచుకుంటున్నారు.

Update: 2026-02-04 06:41 GMT

Hyderabad: హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన శాంభవిదేవి అనే మహిళ గత మూడేళ్లుగా ఒక మగ 'పెర్షియన్ పిల్లి'ని (Persian Cat) పెంచుకుంటున్నారు. ఇటీవల ఆ పిల్లికి అనారోగ్యం చేయడంతో ఆమె ఎల్‌బీ నగర్‌లోని ఒక వెటర్నరీ క్లినిక్‌కు తీసుకెళ్లారు.

పిల్లికి సర్జరీ చేసిన వైద్యుడు డాక్టర్ క్రాంతి కుమార్, చికిత్స కోసం రూ. 35,000 వసూలు చేశారు. అయితే సర్జరీ జరిగిన తర్వాత పిల్లి ఆరోగ్యం మెరుగుపడకపోగా, మరింత క్షీణించింది. పిల్లి మలవిసర్జన చేయలేక తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో ఆమె తిరిగి డాక్టర్‌ను ఆశ్రయించారు.

డాక్టరును నిలదీయగా, ఆయన శాంభవిదేవిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇంకోసారి క్లినిక్‌కు వస్తే చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించారు.

జనవరి 31న ఆమె డాక్టర్‌కు ఫోన్ చేయగా, "నీ పిల్లికి చికిత్స చేయను, ఇంకోసారి ఫోన్ చేయకు" అని దురుసుగా సమాధానం ఇచ్చారు.

వైద్యుడి తీరుతో విసిగిపోయిన బాధితురాలు మంగళవారం చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News