MLA Vivekananda Tested Positive for Covid19: మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..

MLA Vivekananda Tested Positive for Covid19: మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..
x
Representational Image
Highlights

MLA Vivekananda Tested Positive for Covid19: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.

MLA Vivekananda Tested Positive for Covid19: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సామాన్యప్రజలతో పాటు ఎంతో మంది అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ ఈ కరోనా మహమ్మారి బారిన పడక తప్పడం లేదు. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రతి పక్షపార్టీకు చెందిన పలువురు నాయకులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో ఎమ్మెల్యే కూడా కరోనా బారిన పడ్డారు. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టుగా ఆదివారం వైద్యులు వెల్లడించారు. ఆయనతో పాటు ఆయన భార్య సౌజన్య, కుమారుడు విధాత్‌లకు సైతం కోవిడ్‌ సోకినట్లు వైద్యులు స్పష్టంచేసారు. ఈ విషయం తెలియగానే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తమ ఇంట్లోనే వేర్వేరు గదుల్లో హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇక అధికారులు ఎమ్మెల్యేను కలిసిన వారి జాబితాను తీసుకుంటున్నారు.

ఇక పోతే నిన్న రాష్ట్రంలో 1,296 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 45,076కి చేరుకుంది. ఇందులో ప్రస్తుతం 12,224 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 1,410 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీనితో కోలుకున్న వారి సంఖ్య 32,438కి చేరుకుంది. ఇక నిన్న ఆరుగురు కరోనాతో మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 415 కి చేరుకుంది. 1,831 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క GHMC పరిధిలోనే 557 కేసులు ఉన్నాయి.

ఇక మిగతా జిల్లాల విషయానికి వచ్చేసరికి రంగారెడ్డి 111, మేడ్చెల్ 87, సంగారెడ్డి 28, ఖమ్మం 5, కామారెడ్డి 67, వరంగల్ అర్బన్ 117, వరంగల్ రూరల్ 41,కరీంనగర్ 27, జగిత్యాల 11, యదాద్రి 15, మహబూబాబాద్ 21, పెద్దపల్లి 29, మెదక్ 29, మహబూబ్ నగర్ 6, నల్గొండ 26, సిరిసిల్ల 19, ఆదిలాబాద్ 15, నాగూర్ కర్నూల్ 13, జనగాం 5, నిజామాబాద్ 24, సిద్ధిపేట 10, సూర్యాపేటలో 16, గద్వాల్ 4, వనపర్తి 7, ములుగు 2, నిర్మల్ , ఆసిఫాబాద్ , వికారాబాద్ లలో కేసులు నమోదు అయినట్టుగా ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులిటెన్ లో పేర్కొంది.


Show Full Article
Print Article
Next Story
More Stories