Coronavirus updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1,296 కరొనా పాజిటివ్ కేసులు నమోదు!

Coronavirus updates in Telangana: తెలంగాణలో కరోనా వైరస్ కేసులు గత కొద్ది రోజులుగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా రాష్ట్రంలో 1,296 కరోనా కేసులు నమోదు అయ్యాయి

Krishna
Published on: 19 July 2020 10:53 PM IST
Coronavirus updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1,296 కరొనా పాజిటివ్ కేసులు నమోదు!
X
Coronavirus updates in Telangana 1,296 New cases registered in 24 hours

Coronavirus updates in Telangana: తెలంగాణలో కరోనా వైరస్ కేసులు గత కొద్ది రోజులుగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా రాష్ట్రంలో 1,296 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 45,076కి చేరుకుంది. ఇందులో ప్రస్తుతం 12,224 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1,410 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీనితో కోలుకున్న వారి సంఖ్య 32,438కి చేరుకుంది. ఇక ఇవ్వాలా ఆరుగురు కరోనాతో మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 415 కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 1,831 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క GHMC పరిధిలోనే 557 కేసులు ఉన్నాయి.

ఇక మిగతా జిల్లాల విషయానికి వచ్చేసరికి రంగారెడ్డి 111, మేడ్చెల్ 87, సంగారెడ్డి 28, ఖమ్మం 5, కామారెడ్డి 67, వరంగల్ అర్బన్ 117, వరంగల్ రూరల్ 41,కరీంనగర్ 27, జగిత్యాల 11, యదాద్రి 15, మహబూబాబాద్ 21, పెద్దపల్లి 29, మెదక్ 29, మహబూబ్ నగర్ 6, నల్గొండ 26, సిరిసిల్ల 19, ఆదిలాబాద్ 15, నాగూర్ కర్నూల్ 13, జనగాం 5, నిజామాబాద్ 24, సిద్ధిపేట 10, సూర్యాపేటలో 16, గద్వాల్ 4, వనపర్తి 7, ములుగు 2, నిర్మల్ , ఆసిఫాబాద్ , వికారాబాద్ లలో కేసులు నమోదు అయినట్టుగా ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులిటెన్ లో పేర్కొంది.

ఇదిలావుంటే గత కొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకొని వారు పెద్ద సంఖ్యలో ఉండడం సంతోషాన్ని కలిగిస్తుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. అందులో భాగంగా టెస్టింగ్ సామర్ధ్యాన్ని జిహెచ్ఎంసీ తోపాటుగా మరికొన్ని జిల్లాల్లో భారీగా పెంచింది. ఇక కరోనాని మరింతగా కట్టడికి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంటైన్మేంట్ జోన్లలో ఈ నెల చివరి వరకు లాక్ డౌన్ ని పొడిగించింది.



Krishna

Krishna

Next Story