Coronavirus updates in Andra pradesh: ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు

Coronavirus updates in Andra pradesh: రాష్ట్రంలో గత 24 గంటల్లో 31,148 సాంపిల్స్‌ ని పరీక్షించగా 5,041 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.

Raj
By Raj
Published on: 19 July 2020 7:53 PM IST
Coronavirus updates in Andra pradesh: ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు
X
Coronavirus updates in Andra pradesh 5,041 New cases registered in 24 hours

Coronavirus updates in Andra pradesh: రాష్ట్రంలో గత 24 గంటల్లో 31,148 సాంపిల్స్‌ ని పరీక్షించగా 5,041 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కొత్తగా 1106 మంది కోవిడ్‌ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌ వల్ల తూర్పు గోదావరి లో 10, శ్రీకాకుళంలో 8 మంది, కర్నూల్‌ లో ఏడుగురు, విశాఖపట్నం లో ఏడుగురు, కృష్ణ లో ఏడుగురు , ప్రకాశం లో నలుగురు, అనంతపురం లో ముగ్గురు, కడప లో ముగ్గురు, విజయనగరం లో ముగ్గురు , గుంటూరు లో ఇద్దరు , చిత్తూరు లో ఇద్దరు మరణించారు.

నేటివరకు రాష్ట్రంలో 13,15,532 సాంపిల్స్‌ ని పరీక్షించారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 46,755 పాజిటివ్ కేసు లకు గాను.. 2461 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారుండగా.. 434 మంది ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చిన వారున్నారు. 20,329 మంది డిశ్చార్జ్ కాగా.. 642 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 25,754 గా ఉంది. ఇక జిల్లాల వారీగా యాక్టీవ్ కేసుల సంఖ్య ఇలా ఉంది. అనంతపురం 2341, చిత్తూరు 3139, తూర్పు గోదావరి 4819, గుంటూరు 2279, కడప 1246, కృష్ణ 1240, కర్నూల్ 3319, నెల్లూరు 1563, ప్రకాశం 671, శ్రీకాకుళం 1599, విశాఖపట్నం 678, విజయనగరం 1076, పశ్చిమ గోదావరి 1814 గా ఉన్నాయి.



Raj

Raj

Next Story