CM Revanth Reddy: మున్సిపల్ సమరం: నేటి నుంచి రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి.. జిల్లాల వారీగా ప్రచార షెడ్యూల్ ఇదే!

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వాతావరణం హీటెక్కింది.

Update: 2026-02-04 05:53 GMT

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఇప్పటికే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో నామినేషన్ల ఉపంహరణకు గడువు ముగిసింది. ఇవాళ్టి నుంచి ప్రధాన పార్టీలు ప్రచార హోరును ప్రారంభించనున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిలో భాగంగా ఇవాళ్టి నుంచి సీఎం రేవంత్ రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు. పలు జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రచార సభల్లో సీఎం పాల్గొననున్నారు.

ఇవాళ నల్గొండ, మిర్యాలగూడలో పర్యటించనున్నారు. జిల్లాలో దాదాపు వెయ్యి కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించనున్నారు. అదేవిధంగా రేపు కరీంనగర్ జిల్లా చొప్పదండి, ఎల్లుండి నిజామాబాద్, ఈనెల 7న రంగారెడ్డిలోని పరిగి, 8న వరంగల్‌ జిల్లా భూపాలపల్లి, 9న మెదక్‌లో ఎన్నికల సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

Tags:    

Similar News