Telangana MLAs Defection Case: ఈ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ..స్పీకర్‌ ముందుకు కడియం

Telangana MLAs Defection Case: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కీలక దశకు చేరుకుంది.

Update: 2026-02-04 05:47 GMT

Telangana MLAs Defection Case: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న డిమాండ్ పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వేగంగా అడుగులు వేసల్తున్నారు. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కడియం శ్రీబరిపై దాఖలైన అనర్హత పిటిషన్ పై ఎమ్మెల్యే వివేకానంద వాదనలను నమోదు చేయానున్నారు.

బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడియం పార్టీ మారడం ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు వస్తుందని.. ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పీకర్ కు పిటిషన్ సమర్పించారు. ఈ విచారణనకు వివేకానందకు కూడా నోటీసులు జారీ చేశారు. కడియం అనర్హత పిటిషన్ కు అత్యంత ప్రాదాన్యత సంతరించుకుంది. ఈ విచారణకు ఇరుపక్షాలకు సంబంధించిన న్యాయవాదులు హాజరు కావాలని స్పీకర్ నోటీసుల్లో పేర్కొన్నారు. కడియం శ్రీహరి తరపున, బీఆర్ఎస్ తరపునన న్యాయవాదులు స్పీకర్ ముందు తమ వాదనలు వినిపించనున్నారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఆధారాలను స్పీకర్ పరిశీలించి.. తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.

కడియం శ్రీహరి మాత్రమే కాకుండా మరికొంత మంది ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్లు కూడా స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్ కు సంబంధించిన విచారణ కూడా జరుగుతుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విషయంలో జడ్జిమెంట్ రావాల్సి ఉంది. వీరందరిపై విచారణ పూర్తి చేసి స్పీకర్ ఒకే సారి తుది నిర్ణయం లేదా జడ్జిమెంట్ వెలువరించే అవకశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై ఇటువంటి పిటిషన్లు ఉండగా.. ఇప్పటికే ఏడుగురికి సంబంధించిన ప్రక్రియ వివిధ దశల్లో ఉందని తెలుస్తోంది.

Tags:    

Similar News