Revanth Reddy : పొన్నాల లక్ష్మయ్య రాజీనామాపై స్పందించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy : పీసీసీగా ఉండి పొన్నాల 40వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు

Update: 2023-10-14 04:08 GMT

 Revanth Reddy : పొన్నాల లక్ష్మయ్య రాజీనామాపై స్పందించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య రాజీనామాపై స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఉండేవాళ్లు ఉంటారు, పోయేవాళ్లు పోతారు. డీఎస్, కేశవరావు లాంటి వాళ్లు వెళ్లారని ఇప్పుడు పొన్నాల వెళ్లినా వచ్చే నష్టమేమీ లేదన్నారు. పీసీసీగా ఉండి 40వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని రెండోసారి టికెట్ ఇస్తే 50వేల ఓట్ల తేడాతో ఓడిపోయారన్న రేవంత్. ప్రజల్లో ఉండి సేవ చేస్తే ఎందుకు గెలవలేదని ప్రశ్నించారు. పొన్నాలకు గుర్తింపు ఇచ్చిందే కాంగ్రెస్ అని కార్యకర్తలకు క్షమాపణ చెప్పి ఆయన రాజీనామా ఉపసంహరించుకోవాలన్నారు.

Tags:    

Similar News