Praja Dairy Award: ఏవీఎస్ ఎండీ డాక్టర్ రాజాకు ప్రజాడైరీ అవార్డు
Praja Dairy Award: ఏవీఎస్ ఎండీ డాక్టర్ రాజాకు ప్రజాడైరీ అవార్డు
Praja Dairy Award: ఏవీఎస్ ఎండీ డాక్టర్ రాజాకు ప్రజాడైరీ అవార్డు
Praja Dairy Award: ప్రముఖ మాసపత్రిక ప్రజా డైరీ ప్రతిఏటా ఉత్తమ వైద్యుల అవార్డుల ప్రధానం చేస్తోంది. అందులో భాగంగా హాస్పిటల్స్ ఎండీ ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా. వి కొప్పాలకు హోం మంత్రి మహమూద్ అలీ అవార్డును అందజేశారు. తెలంగాణ సెక్రటేరియట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును అందించారు. వేస్కులర్ విభాగంలో ఉత్తమ వైద్య సేవలు అందించే ఏవిస్ హాస్పిటల్‌కు, హాస్పిటల్ ఎండి రాజాకు ఈ అవార్డు అందజేయడం అభినందనీయమని మంత్రి అన్నారు. ఎవిస్ హాస్పిటల్స్ మరిన్ని శాఖలతో విస్తరించి ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని ఆయన అభిలాషించారు. ఈ కార్యక్రమంలో ప్రజా డైరీ ఎడిటర్ వి సురేష్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.