Metpally: ఆస్తి పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్.. ముందస్తుగా కడితే 5% రాయితీ!
Metpally: మెట్టుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపుదారులకు 5 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది.
Metpally: ఆస్తి పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్.. ముందస్తుగా కడితే 5% రాయితీ!
మెట్టుపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక సంఘాల పరిధిలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు తీపి కబురు అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) కు సంబంధించి ముందస్తుగా ఇంటి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ (Early Bird Scheme) కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మెట్టుపల్లి మున్సిపల్ చైర్మన్ శ్రీ మైలారపు లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ ఈ రాయితీ పథకం కేవలం ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
మెట్టుపల్లి పట్టణంలోని మొత్తం 26 వార్డుల ప్రజలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. గడువు ముగిసిన తర్వాత పూర్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి, ముందస్తుగా చెల్లించి ఆర్థిక లబ్ది పొందాలని ఆయన కోరారు.
పట్టణ ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే మెట్టుపల్లి మున్సిపాలిటీలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు మరియు పారిశుధ్య పనులు మెరుగుపడతాయని, ప్రజలు పన్నులు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పన్ను చెల్లింపుదారులు మున్సిపల్ కార్యాలయంలోని కౌంటర్లలో నేరుగా గానీ, లేదా ఆన్‌లైన్ ద్వారా (CDMA వెబ్‌సైట్/యాప్) సులభంగా పన్ను చెల్లించవచ్చని సూచించారు.
ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఈ రాయితీని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. మీ ఇంటి పన్నును సకాలంలో చెల్లించి, మెట్టుపల్లిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని కోరారు.