Karimnagar: సర్పంచ్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డు.. క్రీడా మిత్రలో టాప్

Karimnagar: కరీంనగర్ జిల్లా కోనేరుపల్లె గ్రామ సర్పంచ్ కాసు వేణుగోపాల్ రాజు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు.

Update: 2026-04-08 12:15 GMT

Karimnagar: సర్పంచ్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డు.. క్రీడా మిత్రలో టాప్

Karimnagar: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కోనేరుపల్లె గ్రామ సర్పంచ్ కాసు వేణుగోపాల్ రాజు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ప్రథమ బహుమతిని గెలుచుకుని గ్రామానికి గౌరవాన్ని తీసుకువచ్చారు. గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలలో ఆయన చురుకుగా పాల్గొని తన ప్రతిభను చాటుకున్నారు.

భారత గ్రామీణాభివృద్ధికి మద్దతుగా Quality Council of India రూపొందించిన “సర్పంచ్ సంవాద్” యాప్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ, గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేశారు. ముఖ్యంగా మార్చి నెలలో భారత ప్రభుత్వం చేపట్టిన “క్రీడా మిత్ర పంచాయతీ” కార్యక్రమంలో భాగంగా గ్రామ యువతను క్రీడలవైపు మళ్లించే దిశగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాల అమలులో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అందించిన సహకారం కీలక పాత్ర పోషించింది. గ్రామంలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించడంతో పాటు యువతలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ పెంచే విధంగా అనేక చర్యలు తీసుకున్నారు. సర్పంచ్ వేణుగోపాల్ రాజు చేసిన ఈ వినూత్న కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతితో సత్కరించింది. ఈ సందర్భంగా ఆయనకు రూ.35,000 నగదు బహుమతి ప్రదానం చేయడం జరిగింది.

ఈ విజయంతో కోనేరుపల్లె గ్రామం రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా, ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామ అభివృద్ధి పట్ల పట్టుదలతో పనిచేస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందవచ్చని సర్పంచ్ వేణుగోపాల్ రాజు నిరూపించారు.

Tags:    

Similar News