Jagtial: మంత్రి గారు ప్రారంభించారు.. కానీ కొనుగోళ్లు ఎక్కడ?
Jagtial: జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
Jagtial: మంత్రి గారు ప్రారంభించారు.. కానీ కొనుగోళ్లు ఎక్కడ?
Jagtial: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డు బాట పట్టారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పాత బస్టాండ్ వద్ద 63వ నంబర్ జాతీయ రహదారిపై పలు గ్రామాల రైతులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
ఓ పక్క అకాల వర్షాలతో చేతికి వచ్చిన పంటలు తడిచి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించిన జిల్లాలోని ఏకైక మొక్కజొన్న కొనుగోలు కేంద్రమైన ఇబ్రహీంపట్నం లో ఇప్పటి వరకు ఒక్క కొనుగోలు కూడా జరపకపోవడం విశేషమని రైతులు వాపోయారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆందోళన చేసిన సమయంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు హామీ ఇస్తూ మర్చిపోతుందని,రైతులను మోసం చేసే ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుదామని రైతులు అన్నారు.రాస్తారోకో సందర్భంగా జాతీయ రహదారిపై భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.