Karimnagar: అంగన్‌వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవ
Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధరలో అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ. చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాలకు చెందిన 140 మందికి ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.
Karimnagar: అంగన్‌వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవ
కరీంనగర్ జిల్లా: గంగాధర మండలం మధురానగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ సిబ్బందికి మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాలకు చెందిన మొత్తం 140 మంది అంగన్వాడీ టీచర్లకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మొబైల్ ఫోన్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులకు ముఖ్యమైన సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారులతో సమన్వయం, సమాచారం వేగంగా చేరవేయడం వంటి అంశాల్లో మొబైల్ ఫోన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. టెక్నాలజీ వినియోగంతో అంగన్వాడీ సేవలు మరింత సమర్థవంతంగా అందించగలమని ఆయన అన్నారు.
అంగన్వాడీ టీచర్లు కూడా ఈ సదుపాయం కల్పించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మొబైల్ ఫోన్ల ద్వారా తమ విధులు మరింత సులభంగా నిర్వహించగలమని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.