Kurnool: ఆరోగ్యం కోసం ఏకమవుదాం.. విజ్ఞానశాస్త్రానికి మద్దతుగా నిలుద్దాం

Kurnool: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కర్నూలు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

Update: 2026-04-08 10:00 GMT

Kurnool: ఆరోగ్యం కోసం ఏకమవుదాం.. విజ్ఞానశాస్త్రానికి మద్దతుగా నిలుద్దాం

కర్నూలు: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం* సందర్బంగా జిల్లా యువజన సంక్షేమ శాఖ - సెట్కూరు ఆధ్వర్యంలో కర్నూలు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సెట్కూరు సీఈవో డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రజలను విజ్ఞానశాస్త్రానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఆరోగ్యం కోసం ఏకమవుదాం. విజ్ఞానశాస్త్రానికి మద్దతుగా నిలుద్దాం” అనే ఇతివృత్తంతో, ఈ సంవత్సరం ప్రజలందరు జంతువులు, మొక్కలు మరియు భూగోళం యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో శాస్త్రీయ సహకారానికిన్న శక్తిని చాటిచెప్పలాన్నారు. రక్తదానం, అవయవదానం లపై ఉన్న అపోహలను తొలగించి అవగాహన పెంపొందించి ప్రజలను చైతన్యవంతులను చేయవలెనని కోరారు.

ప్రభుత్వ నర్సింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.మంజుల గారు మాట్లాడుతూ ఆరోగ్యం మనకు అత్యంత ముఖ్యమైన విషయం అని నేడు చాలా మంది ప్రజలు జీవనశైలి, రకరకాల వ్యాధులు మరియు వాతావరణ మార్పులకు సంబంధించిన ఆరోగ్య సమస్యల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని . ప్రజలు తమ స్వీయ సంరక్షణ పద్ధతులను మరియు ఇతరుల సంరక్షణ పట్ల వారి విధానాలను మూల్యాంకనం చేసుకోవడానికి సహాయపడటానికే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా నర్సింగ్ విద్యార్థినులకు వక్తృత్వ,వ్యాసరచన, పోస్టర్ తయారీ పోటీలను నిర్వహించారు. విజేతలకు జ్ఞాపికలు, ప్రశాంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమ అనంతరం విద్యార్థులు మరియు సెట్కూరు సిబ్బంది వారు కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల నోడల్ అధికారిణి వైడూర్యం మరియు NSS ప్రోగ్రామ్ అధికారిణి శ్రీదేవి సెట్కూరు సిబ్బంది శ్యామల, నిదీష్, శ్రీనివాస సింగ్ మొదలగువారు పాల్గొన్నారు.

Tags:    

Similar News