Bobbili: మధ్యలో వదిలేస్తే మా పిల్లల గతి ఏంటి.. తల్లిదండ్రుల ఆవేదన

Bobbili: బొబ్బిలి నారాయణ జూనియర్ కాలేజ్ యాజమాన్యం అద్దె బకాయిలు, నిర్వహణ ఖర్చులు సాకుగా చూపి విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపిస్తామని ప్రకటించడం కలకలం రేపుతోంది.

Update: 2026-04-08 11:46 GMT

Bobbili: మధ్యలో వదిలేస్తే మా పిల్లల గతి ఏంటి.. తల్లిదండ్రుల ఆవేదన

Bobbili: బొబ్బిలిలో ఉన్న నారాయణ జూనియర్ కాలేజ్ యాజమాన్యం తీసుకున్న తాజా నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్లు (TC) ఇచ్చి పంపించనున్నట్లు యాజమాన్యం ప్రకటించడం కలకలం రేపుతోంది.

కాలేజ్ బిల్డింగ్ అద్దె చెల్లించలేకపోవడం, నిర్వహణ ఖర్చులు అధికంగా ఉండటం వంటి కారణాలను చూపిస్తూ, "మీ పిల్లలకు TCలు ఇస్తాం. మీరు ఇతర కాలేజీల్లో చేర్పించుకోండి" అని తల్లిదండ్రులకు చెప్పినట్లు సమాచారం. ఈ అకస్మాత్తు నిర్ణయం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందోనని తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. సాలూరు కు చెందిన విద్యార్థులు,శశాంక్ (MPC) ఇంటర్ 1st ఇయర్ దిలీప్ కుమార్, (MPC) ఇంటర్ 1st ఇయర్,

తల్లిదండ్రులు మాట్లాడుతూ..

మా పిల్లలు ఇప్పటికే ఇంటర్ కోర్సులో చదువుతున్నారు. మధ్యలో ఇలా TCలు ఇస్తామని చెప్పడం చాలా అన్యాయమని మా పిల్లలు భవిష్యత్తు ఏమవుతుందో భయపడుతున్నామని తమననా శ్రీనివాసరావు,బండి లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై ప్రభుత్వం,విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Tags:    

Similar News