Vizag: విశాఖ పశ్చిమలో అభివృద్ధి పండగ.. కోట్లతో కొత్త హంగులు!

Vizag: విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో రూ. 2.39 కోట్ల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, వార్డు కార్యాలయ భవనాలను ఎంపీ ఎం. శ్రీ భరత్ మరియు ప్రభుత్వ విప్ గణబాబు ప్రారంభించారు.

Update: 2026-04-08 12:23 GMT

Vizag: విశాఖ పశ్చిమలో అభివృద్ధి పండగ.. కోట్లతో కొత్త హంగులు!

Vizag: విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో రూ. 2.39 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ భరత్ మరియు ప్రభుత్వ విప్ గణబాబు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 52, 89 మరియు 90 వార్డులలో సుమారు 2.39 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎం. శ్రీ భరత్ గారు మరియు ప్రభుత్వ విప్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు నేడు ఘనంగా ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించే లక్ష్యంతో ఈ పనులను పూర్తి చేసినట్లు నాయకులు పేర్కొన్నారు.

నేడు ప్రారంభించిన అభివృద్ధి పనుల వివరాలు:

52వ వార్డు: వుడా కాలనీలో రూ. 23 లక్షలతో నిర్మించిన స్వర్ణ వార్డు కార్యాలయ భవనం మరియు రూ. 18 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ అదనపు అంతస్తును ప్రారంభించారు.

90వ వార్డు: కనకమహాలక్ష్మి నగర్‌లో రూ. 13.45 లక్షల వ్యయంతో నిర్మించిన పబ్లిక్ పార్కు మరియు రూ. 32.50 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. కాకాని నగర్‌లో రూ. 35 లక్షలతో నిర్మించిన మహిళా భవనం మరియు ఏఎస్ఆర్ నగర్‌లో రూ. 18 లక్షల వ్యయంతో ఆధునీకరించిన పబ్లిక్ పార్కును ప్రజలకు అంకితం చేశారు.

89వ వార్డు: కొత్తపాలెంలో రూ. 19.6 లక్షల వ్యయంతో పబ్లిక్ పార్కు మరియు రూ. 49.80 లక్షలతో కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. సంతోష్ నగర్‌లో రూ. 19.90 లక్షలతో ముస్లిం కమ్యూనిటీ హాల్ మరియు రూ. 19.85 లక్షలతో కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తును ప్రారంభించారు. ఆదర్శ్ నగర్‌లో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన విశ్వబ్రాహ్మణ (కంశాలి) కమ్యూనిటీ హాల్‌ను ఎంపీ భరత్ గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్ గారు మాట్లాడుతూ, పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు గారు మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా వార్డులలో పార్కులు మరియు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నామని వివరించారు.

ఈ కార్యక్రమంలో APUFIDC డైరెక్టర్ అంగ ప్రశాంతి, స్థానిక నాయకులు బొడ్డేటి విజయ్, వై తిరుమల రావు, వి చంద్ర శేఖర్, బొమ్మిది రమణ , ప్రసాద్, అరుణ్, దాడి రమేష్, కూటమి ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు మరియు నాయకులు, నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు.

Tags:    

Similar News