Vizianagaram: తెర్లాంలో గంజాయి ముఠా గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్
Vizianagaram: విజయనగరం జిల్లా తెర్లాం మండలంలో గంజాయి రవాణా చేస్తున్న నలుగురు నిందితులను, ఒక జువెనైల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Vizianagaram: తెర్లాంలో గంజాయి ముఠా గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్
Vizianagaram: తెర్లాం మండలంలో గంజాయి రవాణా చేస్తూ విక్రయాలకు ప్రయత్నిస్తున్న నలుగురు వ్యక్తులు మరియు ఒక జువెనైల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.స్థానిక అడ్డు రోడ్ సమీపంలోని సా మిల్లు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తెర్లాం ఎస్సై బి. సాగర్ బాబు కు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 2 కేజీలు 600 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అదనంగా నాలుగు సెల్ ఫోన్లు మరియు రూ.350 నగదు సీజ్ చేశారు.
పోలీసుల దర్యాప్తులో, ఒడిశా రాష్ట్రంలోని సుంకి కొండ ప్రాంతాల నుండి గంజాయి కొనుగోలు చేసి తెర్లాం ప్రాంతానికి తీసుకువచ్చినట్లు వెల్లడైంది. ఆగ్రహారం ప్రాంతానికి చెందిన జువెనైల్‌తో విక్రయాలకు ప్రయత్నిస్తున్న సమయంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో జరజన శ్రీరామ్‌పై ఇప్పటికే రెండు గంజాయి కేసులు ఉండగా, లోపింటి నాగరాజు, చౌడువాడ దిలీప్ కుమార్‌లపై ఒక్కొక్క కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరు గతంలో జైలు శిక్ష అనుభవించి వచ్చినట్లు సమాచారం. అదనంగా కుప్పిలి బెన్సన్ (సుమంత్ రెడ్డి)ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
పట్టుబడిన నిందితులు మరియు జువెనైల్‌ను బొబ్బిలి కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ, జరజన శ్రీరామ్‌పై మూడోసారి గంజాయి కేసులో అరెస్ట్ కావడంతో త్వరలోనే PIT NDPS చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.