Srikakulam: అంతర్జాతీయ స్థాయికి 'కవిటి' క్రీడాకారుడు

Srikakulam: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలానికి చెందిన క్రీడాకారుడు జన్ని దేవేంద్ర అంతర్జాతీయ గోల్ షాట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు.

Update: 2026-04-08 16:01 GMT

Srikakulam: అంతర్జాతీయ స్థాయికి 'కవిటి' క్రీడాకారుడు

Srikakulam: అంతర్జాతీయ గోల్ షాట్ బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారుడికి ట్రూ హాండ్స్ ఫౌండేషన్ సహాయం శ్రీకాకుళం జిల్లా, కవిటి మండలం తొత్తిడి పుట్టుగ గ్రామానికి చెందిన క్రీడాకారుడు జన్ని దేవేంద్రకు ట్రూ హాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు.

ఇటీవల తమిళనాడులో నిర్వహించిన జాతీయ స్థాయి గోల్ షాట్ బాల్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొన్న జన్ని దేవేంద్ర మరియు సారవకోట మండలం సారవకోట గ్రామానికి చెందిన వెంకటేష్ తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి అందరి ప్రశంసలు అందుకున్నారు.

వారి ప్రతిభను గుర్తించిన ఎంపిక కమిటీ, వీరిని దక్షిణాసియా అంతర్జాతీయ గోల్ షాట్ బాల్ పోటీలకు ఎంపిక చేసింది. వచ్చే నెల 24 నుంచి 27 వరకు శ్రీలంకలో జరగనున్న ఈ పోటీలలో వీరు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.

ఈ సందర్భంగా ట్రూ హాండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. కృష్ణంరాజు మాట్లాడుతూ, పేద కుటుంబానికి చెందిన జన్ని దేవేంద్ర చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి, ఎన్నో కష్టాలను అధిగమించి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం జిల్లాకు గర్వకారణమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.

Tags:    

Similar News