Tadepalli: అమరావతిపై జగన్ సంచలన వ్యాఖ్యలు!

YS Jagan Mohan Reddy: అమరావతి రాజధాని నిర్మాణ వ్యయంపై మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-04-08 14:16 GMT

Tadepalli: అమరావతిపై జగన్ సంచలన వ్యాఖ్యలు!

YS Jagan Mohan Reddy: రాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్‌’ సూచించామని, దాని వల్ల రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం పడదని, ‘మావిగన్‌ కారిడార్‌’తో తొలి రోజు నుంచే రాజధాని అందుబాటులోకి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. మావిగన్‌ కారిడార్‌లో కేవలం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తే చాలు అన్న ఆయన, ఆ ప్రాంతంలో పోర్టు, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుతో పాటు, 110 కి.మీ మేర జాతీయ రహదారి ఉందని, దీంతో రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

అమరావతిలో కనీస మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు అవసరమని స్వయంగా చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. అమరావతిలో పనులు పూర్తయ్యే సరికి ఎన్నేళ్లు, ఎన్ని దశాబ్ధాలు పడుతుందని, అప్పటికి నిర్మాణ వ్యయం ఎంతకు పెరుగుతుందని, దాని వల్ల రాజధాని రుణాలు ఇంకెంత పెరుగుతాయని.. ఇంకా అసలు రాజధాని ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు తన పనులతో రాజధాని లేకుండా చేస్తున్నారన్న శ్రీ వైయ‹స్‌ జగన్, అందుకే ప్లాన్‌–బి కింద మావిగన్‌ ప్రతిపాదించామని చెప్పారు.

అయితే దాని వల్ల అమరావతిలో తమ అవినీతి కోటలు బద్ధలవుతాయని, తమ సూచనకు చంద్రబాబు ఒప్పుకోవడవం లేదని, మరోవైపు ఓర్చుకోలేక రెచ్చిపోతున్న ఏబీఎన్‌ రాధాకృష్ణ గతి తప్పి తమ పార్టీ నాయకులపై విమర్శలు చేశారని, వారి ఇళ్లలోని మహిళలపైనా అసభ్య పదజాలం ఉపయోగించారని శ్రీ వైయస్‌ జగన్‌ ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చాక గట్టిగా బుద్ధి చెబుతామన్న ఆయన, ఎవ్వరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.

తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో శ్రీ వైయస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే:

మిగిలినవి రెండే బడ్జెట్లు. హామీల అమలు లేదు:

రాష్ట్రంలో పరిస్థితుల గురించి నేను చెప్పాల్సిన పని లేదు. బహుశా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏమిటి, చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది అన్నది నాకన్నా కూడా మీలో ఎవరికి మైక్‌ ఇచ్చినా నా కన్నా చక్కగా చెబుతారు. చంద్రబాబునాయుడు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు? ఎన్నికలు అయిపోయి ఇవాళ రెండు సంవత్సరాలు అయిపోయింది. మూడో సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టాడు. మామూలుగా ఏ ప్రభుత్వం అయినా 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ప్రజలు ఇస్తారు. అలాంటిది చంద్రబాబు మూడు బడ్జెట్లు ఇప్పటికే ప్రవేశపెట్టాడు. అంటే మిగిలి ఉన్నది కేవలం రెండే రెండు బడ్జెట్లు.

ఈ మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన పరిస్థితుల మధ్య, చంద్రబాబు నాయుడి ఈ 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసిన పరిస్థితుల మధ్య, మూడో బడ్జెట్‌లో కూడా అదే రకమైన మోసాలు చేస్తున్న పరిస్థితుల మధ్య, ఒక్కసారి చంద్రబాబు పరిపాలన గమనిస్తే ఈరోజు మనకు కనిపించేవి ఏమిటంటే.. సూపర్‌ సిక్సులు అన్నాడు, సూపర్‌ సెవెన్ల అన్నాడు ఎన్నికల ముందు ప్రతి ఇంటికీ వెళ్లి బాండ్లు ఇచ్చాడు.

ఆ బాండ్ల మీద పవన్‌ కల్యాణ్‌ సంతకం, ఈయన సంతకం పెట్టారు. త్రికరణ శుద్ధితో మేం ఇద్దరం కలిసి ప్రమాణం చేస్తున్నాం, జూన్‌ 2024 నుంచి మీ ప్రతి ఇంటికీ ఇవన్నీ వస్తాయి అని ఏకంగా బాండ్లు ఇచ్చారు. అలాంటి బాండ్లు ఇచ్చి, సూపర్‌ సిక్స్‌లు, సూపర్‌ సెవెన్లు అని చెప్పి ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మోసాలుగానే మిగిలిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు మనం చంద్రబాబునాయుడి పరిపాలనను చూస్తున్నాం.

మ్యానిఫెస్టో అన్నది మన హయాంలో ఒక భగవద్గీత కిందనో, బైబిల్‌ కిందనో, ఖురాన్‌ కిందనో భావిస్తూ 99 శాతం హామీలను నెరవేర్చాం అని ప్రజల దగ్గరకు గర్వంగా తలెత్తుకుని చెప్పడం మన పార్టీ హయాంలో జరిగితే, ఈరోజు మ్యానిఫెస్టో అన్నది చెత్తబుట్టలో పడేసిన పరిస్థితులు మళ్లీ చూస్తున్నాం. కేవలం మారిందల్లా ఒక్క జగనే. జగన్‌ ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి, జగన్‌ లేకపోతే పరిస్థితి ఏమిటి అన్నది మాత్రమే తేడా.

ఛిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ:

ఈరోజు పరిస్థితి ఏమిటి అంటే గతంలో చంద్రబాబునాయుడు ఏమన్నారు. జగన్‌ ఇచ్చిన పథకాలన్నీ ఇస్తాను. ఇంకా అవే కాకుండా అంతకు మించి సూపర్‌ సిక్సులు, సూపర్‌ సెవెన్లు ఇస్తానని చెప్పాడు. కానీ, ఈరోజు పరిస్థతి ఏమిటి అంటే.. బిర్యానీ పెట్టలేరు ఎలాగూ, ఉన్న పలావు కూడా పోయింది అని చెప్పి ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతోంది. ఒకవైపు సూపర్‌ సిక్సులు, సూపర్‌ సెవెన్లు మోసాలుగా మిగిలిపోయిన పరిస్థితులు, మరోవైపున మన పథకాలన్నీ కూడా రద్దయిపోయి, పూర్తిగా ఛిన్నాభిన్నమైపోయిన పరిస్థితుల మధ్య గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఈరోజు కనిపిస్తోంది.

అంతా తిరోగమనం. మొత్తం అప్పులకుప్ప:

విద్య, వైద్యం, వ్యవసాయం, సుపరిపాలన, లా అండ్‌ ఆర్డర్, సంక్షేమం, అభివృద్ధి.. ఇవన్నీ కూడా ఈరోజు తిరోగమనంలో కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా పలాన మంచి చేశాము అనే పరిస్థితి పోయి ఈరోజు ఎక్కడ చూసినా కూడా తిరోగమనమే కనిపిస్తోంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా.. మన 5 సంవత్సరాల కాలంలో మనం రూ.3.31 లక్షల కోట్లు అప్పులు చేస్తే, అందులో రూ.2.73 లక్షల కోట్లు నేరుగా మీ జగన్‌ బటన్లు నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్లిపోవడం చూశాం. ఆ రూ.2,73 లక్షల కోట్లు ఎవరి అకౌంట్లలోకి పోయాయి, వారి ఆధార్‌ నంబర్లు ఏమిటి అన్నది కూడా మనం ఇవ్వగలుగుతాం. అంతగా మనం రూ.3.31 లక్షల కోట్లు అప్పు తెస్తే రూ.2,73 లక్షల కోట్లు ఈ మాదిరిగా మనం జమా ఖర్చు కూడా ఇవ్వగలుగుతాం. ఆధార్‌ నంబర్లతో సహా.

కానీ ఇదే చంద్రబాబు ఈ రెండు సంవత్సరాలు తిరక్క మునుపే.. మనం ఐదేండ్లలో రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేస్తే, ఈయన 2 సంవత్సరాలు తిరక్కుండానే రూ.3.52 లక్షల కోట్ల అప్పు. గ్రాస్‌ అప్పులు, ఇంకా కమిటెడ్‌ అప్పులు.. ఏకంగా రూ.3,52 లక్షల కోట్లు దాటాయి. మరి ఈ 3.52 లక్షల కోట్లు ఏమయ్యాయి? ప్రజలకు ఎందుకు బటన్లు లేవు. ప్రజల ఖాతాల్లోకి ఎందుకు రావడం లేదు? ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది? ఎవరి జోబుల్లోకి ఈ డబ్బంతా పోతోంది? అన్నది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశమే. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ.

అంతా దోచుకో పంచుకో తినుకో. డీపీటీ:

మన హయాంలో ఎలా చేయగలిగాం. జగన్‌ తన హయాంలో ఎలా చేయగలిగాడు? జగన్‌ వెళ్లిన తర్వాత చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు అన్నది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతోంది. మరి జగన్‌ చేయగలిగాడు, చంద్రబాబునాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? కారణం ఒక్కటే. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు జగన్‌ హయాంలో పుష్కలంగా వచ్చేవి. ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో ఎక్కడ చూసినా దోచుకో, పంచుకో, తినుకో.

రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలన్నీ కూడా వీళ్లు దోచుకోవడానికి, వీళ్లు పంచుకోవడానికి, వీళ్లు తినుకోవడానికే సరిపోతున్నప్పుడు, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రానప్పుడు రాష్ట్రం పరిస్థితి ఏమిటి? ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా ఈరోజు కనిపించేదేమిటి?. లిక్కర్‌ మాఫియా. ఏ గ్రామంలో చూసినా బెల్ట్‌ షాపులు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు నాలుగు కాదు. మళ్లా పోలీసులు దగ్గరుండి ఆ బెల్టు షాపుల్లో అమ్మించే కార్యక్రమం. ఆ బెల్ట్‌ షాపుల్లో ఎక్కడా కూడా ఎమ్మార్పీకి అమ్మరు. ఎమ్మార్పీ కంటే రూ.10, రూ.20 ఎక్కువకు అమ్ముతున్నారు. అందుకే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. అంతా వీళ్ల జోబుల్లోకి పోతోంది.

లిక్కర్‌ నుంచి మొదలు పెడితే.. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్‌›్జ, ల్యాటరైట్, గ్రానైట్, చివరికి చికెన్‌ అమ్మాలన్నా కూడా వీళ్లకు రావాల్సింది వీళ్లకు ఇస్తేనే చికెన్‌ అమ్ముతున్నారు మార్కెట్లో. అదర్‌ వైజ్‌ చికెన్‌ కూడా అమ్మనివ్వడం లేదు చాలా నియోజకవర్గాల్లో. ఆస్థాయిలో దోచుకుంటున్నారు. ఇంకా అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు. పీపీఏలు. మన హయాంలో మనం రూ.2.49కి పీపీఏ చేసుకున్నాం. రైతులకు మరో 25–30 ఏళ్లపాటు ఉచిత కరెంటు అన్నది ఒక హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా అందించాలన్న ఆరాటంతో రూ.2.49కే మనం పీపీఏలు చేస్తే ఆరోజు నానా యాగీలు చేసిన వీళ్లు ఈరోజు రూ.4.60కి పీపీఏ చేస్తున్నారు. ఎంత తేడా! కళ్ల ముందే కనిపిస్తున్నాయి.

ప్రభుత్వ భూములు పప్పులూ, బెల్లాలకు అమ్మేస్తున్నారు. రూపాయికి షాపుకు పోతే చాక్లెట్‌ వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ, ఆంధ్ర రాష్ట్రంలో రూపాయికి కోట్ల విలువ చేసే భూములు మాత్రం వస్తున్నాయి. కళ్ల ఎదుటే రుషికొండకు ఎదురుగా 50 ఎకరాల ప్రభుత్వ భూమి, చంద్రబాబు తన సమీప బంధువు అయిన, విశాఖపట్నం ఎంపీకి రూ.5 వేల కోట్లు విలువజేసే భూమిని ఫ్రీగా ఇచ్చాడు. ఊరికే రెగ్యులరైజేషన్‌ చేశారు. అంత దారుణంగా రాష్ట్రానికి సంబంధించిన భూములు కాజేస్తున్నారు.

అమరావతిలో కళ్ల ఎదుటే యథేచ్ఛ దోపిడీ:

ఇక అమరావతి గురించి చెప్పాల్సిన పనిలేదు. అమరావతిలో ఎంత దారుణమైన స్కాములు జరుగుతున్నాయన్నది మనందరికీ ఇప్పటికే అర్థమైంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి మహా నగరాల్లో ఫైవ్‌ స్టార్‌ లెవెల్‌లో.. ఇటాలియన్‌ మార్బుల్‌ వంటి సదుపాయాలతో కట్టినా నిర్మాణాలు చేయడానికి చదరపు అడుగుకి అయ్యే ఖర్చు రూ.4500కు మించదు. కానీ అమరావతిలో మాత్రం అడుగుకు రూ.12 వేల నుంచి రూ.14 వేలు ఖర్చవుతోంది. 6 లైన్ల జాతీయ రహదారి టెండర్లు పిలిస్తే కి.మీ రోడ్డు రూ.20 కోట్లకు పూర్తవుతోంది. ఇక్కడ మాత్రం రూ.53 కోట్లవుతోంది.

ఎక్కడా లేని స్కాములు. ఎవరు ఈ స్కాముల్లో భాగస్వాములు అంటే, ఈనాడు కిరణ్‌ వియ్యంకుడు ఒకరు. ఇంకొకరు చంద్రబాబు బినామీ బలుసు శ్రీనివాసరావు (బీఎస్సార్‌). అంతా వీళ్లే. వీళ్లకు కొత్తగా మళ్లీ మొబిలైజేషన్‌ అడ్వాన్సులు. ఇంతకుముందు వర్కులు చేస్తే బిల్లులు చెల్లించే వాళ్లం. చంద్రబాబు పాలనలో వర్కులు చేయాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు అందరూ చంద్రబాబు మనుషులే. అందరికీ 10 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్సు. ఒక్కొక్కరికీ రూ.6 వేల కోట్ల వర్కులు. దానికి రూ.600 కోట్లు మొబిలైజేషన్‌ అడ్వాన్సులు. వర్కులు చేయడం కథ దేవుడెరుగు ఫస్ట్‌ మొబిలైజేషన్‌ అడ్వాన్సులు. ఆ స్థాయిలో దోచేస్తున్నారు. ఇలా కొల్లగొడుతూ ఉంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది? ఇలా దోచుకుంటూ పోతే రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి వర్గాల పరిస్థితి ఏంటి?.

ఏం జరిగినా రైతులను ఆదుకునే నాథుడు లేడు:

కూటమి పానలో ఏ రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఏ పంట చూసినా దళారీల వ్యవస్థ. మన హయాంలో ఆర్బీకే, ఈ క్రాప్, సీఎం యాప్‌ (కంటిన్యూయస్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రైసెస్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌) పెట్టి గిట్టుబాటు ధరలకు పంటలు కొనుగోలు చేసే వాళ్లం. ఆయా పంటలకు గిట్టుబాటు ధరలు నిర్ణయించి ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక పోస్టర్‌ ప్రదర్శించే వాళ్లం. అంతకన్నా తక్కువ రేట్లు కనిపిస్తే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకునేది. సదరు ఆర్బీకే పరిధి నుంచి అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ వెంటనే సీఎం యాప్‌లో అప్లోడ్‌ చేసే వాడు. మార్క్‌ఫెడ్‌ నుంచి జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పోస్టుకు జాయింట్‌ కలెక్టర్‌ని నియమించాం. వెంటనే ఆయన ఇన్వాల్వ్‌ అయ్యేవాడు. వెంటనే ఆ ఆర్బీకే పరిధిలోనే మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ జరిగేది.

గిట్టుబాటు ధరలకు పంటలు కొనుగోలు చేసేవాళ్లం. ఆ రకంగా రూ.7800 కోట్లు ఖర్చు చేసి ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు ఇచ్చిన పరిస్థితి నుంచి నేడు, ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు. రైతులకు ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. రైతులకు కరువొచ్చినా, తుపాన్‌ వచ్చినా ఆదుకునే నాథుడు లేడు. వాళ్ల ఖర్మకి వదిలేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తోంది. సీజన్‌ ముగిసేలోపు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి మరుసటి సీజన్‌కి రైతును సన్నద్ధం చేసేవాళ్లం. ఈరోజు ఇన్‌పుట్‌ సబ్సిడీ గురించి మాట్లాడేవాడే లేడు. ఆక్వాకి సంబంధించీ అదే పరిస్థితి. ఎక్కడా పట్టించుకునే దిక్కు లేదు.

గవర్నమెంట్‌ స్కూల్స్‌ నిర్వీర్యం:

చదువుల పరిస్థితి ఇంకా ఘోరం. మన ప్రభుత్వంలో ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో క్రమం తప్పకుండా జమ చేసే వాళ్లం. విద్యాదీవెన, వసతి దీవెన డబ్బులు క్రమ తప్పకుండా ఇచ్చే వాళ్లం. ఇప్పటికే రూ.7 వేల కోట్లకుపైగా పైగా బకాయిలు. ఈ ఏడాది చేయాల్సిన చెల్లింపులు మరో రూ.2600 కోట్లు కూడా చూస్తే మొత్తం రూ.10 వేల కోట్ల బకాయిలు అవుతాయి. ఈ పథకానికి రూ.10 వేల కోట్లు అవసరం ఉంటే బడ్జెట్‌లో రూ.2,600 కోట్లు పెట్టారు. అదీ ఎంత ఇస్తారో తెలియదు. పిల్లలు ఈరోజు చదువులు మానేస్తున్న పరిస్థితి. పిల్లలతో చదువులు మాన్పించి తల్లిదండ్రులు పనికి పంపిస్తున్న పరిస్థితి.

స్కూల్స్‌లో నాడు–నేడు పూర్తిగా ఆగిపోయింది. పిల్లలకు బ్రహ్మాండమైన భోజనం పెట్టాలనే ఆరాటంతో మనం గోరు ముద్ద అనే కార్యక్రమం తీసుకొస్తే ఈరోజు కనుమరుగైన పరిస్థితి. ఎనిమిదో తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపించేవి. ప్రతి స్కూల్‌ ఇంగ్లిష్‌ మీడియం. ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్‌ రూమ్‌కి డిజిటలైజ్‌ క్లాస్‌ రూమ్‌లు. గవర్నమెంట్‌ స్కూళ్లు ప్రైవేటు స్కూల్స్‌తో పోటీ పడలేరు అనే పరిస్థితిని మార్చేసి గవర్నమెంట్‌ స్కూల్స్‌తో పోటీ పడే పరిస్థితి మన హయాంలో మనం తీసుకొచ్చాం. కానీ ఈరోజు స్కూల్స్‌ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితి మన కళ్లెదుటే కనిపిస్తున్న పరిస్థితి.

వైద్యంపై ఆలోచన చేసే నాథుడే లేడు:

వైద్యం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆరోగ్యశ్రీని ప్రతి కుటుంబానికి ఏకంగా రూ.25 లక్షలకు పెంచాం. ప్రొసీజర్లను దాదాపు 3300కి పెంచాం. ఆరోగ్యం బాగా లేకపోతే వైద్యం కోసం పేద, మధ్య తరగతి వాడు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని చేయి పట్టుకుని నడిపించాం. వైద్యం చేయించడమే కాకుండా రెస్ట్‌ తీసుకునే సమయంలో కూడా ఆరోగ్య ఆసరా పేరుతో నెలకు రూ.5 వేలు చేతిలో పెట్టి పంపించాం. ఈరోజు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూ.3200 కోట్లు బకాయిలు ఉన్నాయి, చంద్రబాబూ వాటిని చెల్లించకపోతే చేతులు ఎత్తేస్తున్నాం.. మేం బోర్డు తిప్పేస్తామని ఏకంగా ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. పేదవాడికి వైద్యం అందకపోయినా కనీసం ఆలోచన చేసే నాథుడే ఈరోజు కనిపించడం లేదు.

ఏ వ్యవస్థలోనూ మంచి లేదు:

ఏ వ్యవస్థ చూసినా ఎక్కడా మంచి కనిపించడం లేదు. అంతా తిరోగమనమే కనిపిస్తోంది. రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సినది ఏదీ నిర్వహించడం లేదు. మెడికల్‌ కాలేజీలు అమ్మేస్తున్నారు. ముఖ్యమైన రాయలసీమ లిఫ్టు వంటివి ప్రాజెక్టులు చేయకుండా ఆపేసిన కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. రైతులు, పిల్లలు, అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకునేవాడే లేడు. స్కీముల కథ దేవుడెరుగు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు కనీసం సున్నా వడ్డీ రుణాలు కూడా ఇవ్వని పరిస్థితి. డ్వాక్రా సంఘాలన్నీ నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి.

తోడుగా ఉన్నాం. గర్వంగా చెబుతున్నా:

ఇలాంటి పరిస్థితుల మధ్య వైయస్సార్సీపీ శ్రేణులు ప్రజల తరఫున పోరాటం చేస్తున్నారు. వైయస్సార్సీపీ జెండాను చేత బట్టుకుని ప్రజలకు అండగా, తోడుగా మేం ఉన్నామని గర్వంగా చెబుతున్నాను. కళ్లు మూసుకుని తెరిచేలోపు ఐదేళ్లలో సగం కాలం అయిపోయింది. ఇక మిగిలింది సగం కాలమే.

చంద్రబాబుకు సినిమా చూపిస్తాం:

కూటమి పాలనకు సగం టర్మ్‌ అయిపోయింది. మిగిలింది ఒక సగం టర్మ్‌ మాత్రమే. ఇంకో సంవత్సరం దాటితే, రేపటి సంవత్సరం వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్‌ అవుతుంది. దాని తర్వాత నేను రోడ్డు మీదకు వచ్చి ఒకటిన్నర సంవత్సరం ప్రజలతోనే నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉంటాను. పాదయాత్ర స్టార్ట్‌ అయిన తర్వాత చంద్రబాబుకు ప్రతి రోజు సినిమా చూపిస్తాం.

‘మావిగన్‌’. మోస్ట్‌ ప్రాక్టికల్‌ సొల్యూషన్‌:

చంద్రబాబు తన చర్యలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు. ‘మావిగన్‌’. నిజంగా చంద్రబాబుకు మోస్ట్‌ ప్రాక్టికల్‌ సొల్యూషన్‌ ఇచ్చాం. మనం చాలా లౌక్యంగా అయ్యా చంద్రబాబుగారు మీ చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్‌ లేకుండా చేస్తున్నారు. మీ తీరుతో రాష్ట్రానికి క్యాపిటల్‌ అనేది ఉండదు. ఇది మానుకోండి.

అమరావతి అని మీరు రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారు. ఆ అమరావతిలో రోడ్లు వేయడానికే, కరెంట్‌ ఇవ్వడానికి, డ్రైనేజీ వ్యవస్థ, నీళ్లు వంటి బేసిక్‌ వసతులు కల్పించడానికే నీ అంతట నువ్వే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని సెంట్రల్‌ గవర్నమెంట్‌కు, బ్యాంకులకు డీపీఆర్‌లు ఇచ్చావు. ఈ లెక్కన 50 వేల ఎకరాలకే లక్ష కోట్లకు దిక్కులేదు అనుకుంటే మరో 50 వేల ఎకరాలు అని చెప్పి మళ్లీ భూ సమీకరణ చేపడుతూ.. లక్ష ఎకరాల అమరావతి అని చెబుతున్నావు.

ఈ లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లతో నీవు నిరంతరం రోడ్లు వేయడం, కరెంట్‌ ఇవ్వడం, డ్రైనేజీ పనులు చేస్తూనే ఉంటావు. నిరంతరం నీళ్లు ఇచ్చేందుకే అవస్థలు పడుతుంటే ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇప్పటికే 12 ఏళ్లు గడిచాయి. 2014 నుంచి ఇప్పటి వరకు ఏమీ లేదు. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. డబ్బంతా రోడ్లకే, కరెంట్, నీళ్లకే ఖర్చు అవుతుంది. ఆ రెండు లక్షల కోట్ల విలువ దశాబ్దాలకు రూ.4 లక్షల కోట్లు అవుతుందో, ఇంకా ఎంత అవుతుందో తెలియదు. చివరికి 12 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రానికి రాజధాని లేదు. ఇంకా 20 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటుంది. అయ్యా చంద్రబాబు ఇది మానుకో. ఆ రెండు లక్షల కోట్లలో 10 శాతం ఖర్చు చేస్తే చాలు.

ప్లాన్‌–ఏ వద్దన్నారు. ప్లాన్‌–బీ ఎందుకు ఆలోచించడం లేదు?:

ప్లాన్‌–ఏ వద్దన్నారు సరే. మరి ప్లాన్‌–బీపై ఎందుకు ఆలోచన చేయడం లేదు? నేను ఇంతకు ముందు రాజధాని విషయంలో మంచి ఆలోచన చెప్పాను.

ప్లాన్‌–ఏ కింద రాష్ట్రంలో అన్నింటి కన్నా పెద్ద నగరం విశాఖపట్నంం అందులో కార్యనిర్వాహక రాజధాని పెడితే ఎలాంటి ఖర్చు అవసరం ఉండదు. శ్రీభాగ్‌ ఒప్పందం ప్రకారం అప్పట్లో మనం కర్నూలుకు మాటిచ్చాం. అది నెరవేర్చుతూ అక్కడ న్యాయ రాజధాని పెడుతూ, ఇక్కడే అమరావతిలో శాసన రాజధాని తీసుకువస్తే బాగుంటుందయ్యా అని చెబితే.. నానాయాగీ చేసి, రాజకీయాలు చేసి అవి వద్దు అన్నారు. సరే పోనీ అది వద్దు. కనీసం ఈ ప్రాంతంలోనైనా నీవు చేసే పనికి రాజధానినే లేకుండా పోతుందయ్యా. ఆ పని చేయకుండా కనీసం ఇక్కడైనా ఆలోచన చేయమని ప్లాన్‌–బీ కింద మావిగన్‌ ప్రతిపాదన తెచ్చాం.

10 శాతం ఖర్చు చేస్తే ఇక్కడే బ్రహ్మాండమైన రాజధాని:

మచిలీపట్నంలో పోర్టు కట్టింది నీవు కాదు చంద్రబాబు, మేం కట్టాం. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే పోర్టుకు భూసేకరణ చేపట్టాం. మన హయాంలోనే అనుమతులు తీసుకువచ్చాం. మన హయాంలోనే ఫైనాన్షియల్‌ క్లోజర్‌ చేశాం. అప్పట్లోనే బ్యాంకులతో నీట్‌గా టైఅప్‌ చేసి వర్క్‌ 30–40 శాతం కూడా పూర్తి చేశాం. ఆ పోర్టు పూర్తవుతుంది. మచిలీపట్నం నుంచి విజయవాడకు 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు 40 కిలోమీటర్లు. మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉంది. విజయవాడలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ఉంది. మచిలీపట్నంలో పోర్టు వస్తుంది. ఈ హైవేకు అటుఇటుగా అమరావతిలో కట్టే బిల్డింగ్‌లు ఇక్కడ కడితే బాగుంటుంది.

మచిలీపట్నం నుంచి (మా), విజయవాడ నుంచి (వీ), గుంటూరు నుంచి (గన్‌) అంటూ మావిగన్‌ ప్రతిపాదన చేశాం. ఈ 110 కిలోమీటర్ల ఎకనామిక్‌ కారిడార్‌ను క్యాపిటల్‌ కారిడార్‌గా డిక్లేర్‌ చేసి, ఆ కట్టే బిల్డింగ్‌లు ఇక్కడ కట్టండి. రెండు లక్షల కోట్లలో 10 శాతం ఇక్కడ ఖర్చు చేసి రోడ్లకు కనెక్టివిటీ ఇస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారు అవుతుంది. డే వన్‌ నుంచే రాజధాని వస్తుంది. ఒక గ్రోత్‌ ఇంజన్‌ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ల తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. మావిగన్‌లోనే ఉద్యోగాలు దొరుకుతాయి అని చిలుకకు చెప్పినట్లు చెప్పినా, చంద్రబాబు ఒప్పుకోవడం లేదు.

జగన్‌ ఏం చెప్పినా.. ససేమీరా!:

మనమంతా బాగా, లౌక్యంగా చెప్పినా గానీ ఆహా అంటున్నాడు. ఎందుకు అహాం ఎందుకు వద్దుం కారణం అక్కడ రెండు లక్షల కోట్లలో మొబిలైజేషన్‌ వర్కుల పేరుతో 8 శాతం కమిషన్లు తీసుకోవచ్చు. మావిగన్‌లో ఈ ఆదాయాలు ఉండవు కదా. కాబట్టి మావిగన్‌ వద్దు. అమరావతిలో కాంట్రాక్టర్లు ఎవరు అంటే, ఒకరు ఈనాడు రామోజీరావు వియ్యంకుడు రఘురాయల (ఆర్‌జీవీ), ఇంకొకరు బీఎస్‌ఆర్‌ (బలుసు శ్రీనివాసరావు). వీరు చంద్రబాబు బినామీలు. వారి సంస్థలకు కాంట్రాక్ట్‌లు. అమరావతి కాంట్రాక్టర్లు అంతా వీళ్లే. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. అందుకనే మావిగన్‌ అంటే ఆహాం వైయస్‌ జగన్‌ ఏం చెప్పినా ఆహా అంటున్నారు.

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. ఆయనకెంత బాధో!:

దోచుకునేది.. పంచుకునేది.. తినుకునేది కట్‌ అయిపోతుందని. ఆయనకెంత బాధో.. వైయస్సార్‌ సీపీ శ్రేణులందరిపైనా..అన్యాయమైన మాటలు దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఇదే రాధాకృష్ణకు చెబుతున్నా.. నువ్వన్న మాటలకు.. రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిప్పిన స్టేషన్‌ తిప్పకుండా తిప్పుతాం. వైయస్సార్‌సీపీ శ్రేణులు, వైయస్సార్‌ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తోందా రాధాకృష్ణా?.

క్లియర్‌ గా చెబుతున్నా..వాళ్లకైనా భార్యలు ఉంటారు. వాళ్ల భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా అలా మాట్లాడితే వారికి నచ్చుతుందా? ఎవరికీ నచ్చదు. నచ్చనప్పుడు కనీసం అలాంటి మాటలు మాట్లాడటం తప్పు అని ఈ నాయకులైనా చెప్పాలి కదా? ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు. ఈ లోకేష్‌ చెప్పడు.. ఈ దత్త పుత్రుడు చెప్పడు. సిగ్గు లేకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాటలు మాట్లాడితే.. వాటిని సమర్ధిస్తారు. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోయాయి.

ఈ రోజు సోషల్‌ మీడియాలో ఎప్పుడెప్పుడో కామెంట్లు పెట్టిన పిల్లలను తీసుకువచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు.. జైళ్లలో పెడుతున్నారు.. కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు.. కొడుతున్నారు. రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కూడా ఇదే జరుగుతుంది. మహిళలను తక్కువగా చూసే..

Tags:    

Similar News