Visakhapatnam: విశాఖలో రాష్ట్ర ఆదాయ గణాంకాల జాతీయ వర్క్‌షాప్ ప్రారంభం

Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, గణాంక శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో "రాష్ట్ర ఆదాయం మరియు సంబంధిత గణాంకాలపై ఆల్ ఇండియా వర్క్‌షాప్" ప్రారంభమైంది.

Update: 2026-04-08 11:37 GMT

Visakhapatnam: విశాఖలో రాష్ట్ర ఆదాయ గణాంకాల జాతీయ వర్క్‌షాప్ ప్రారంభం

Visakhapatnam: రాష్ట్ర ఆదాయం గణాంకాలపై ఆల్ ఇండియా వర్క్‌షాప్ విశాఖలో ప్రారంభించిన కేంద్ర గణాంకా మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరబ్ గార్గ్, మన రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పియుష్ కుమార్, రాష్ట్ర ఎకనామిక్స్ &స్థాటిస్టిక్స్ డైరెక్టర్ బి. గోపాల్, కేంద్ర ప్రభుత్వ అధికారులు సుబ్రా సర్కార్, సిద్ధార్ద కుందూ తదితరులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక & గణాంకాల సంచాలకుల కార్యాలయం, ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో “నూతన ప్రామాణిక సంవత్సరం (2022-23) ఆధారంగా రాష్ట్ర ఆదాయం మరియు సంబంధిత గణాంకాలపై ఆల్ ఇండియా వర్క్‌షాప్” బుధవారం విశాఖపట్నంలోని హోటల్ దసపల్లాలో ప్రారంభమైంది.

ఈ వర్క్‌షాప్ ఏప్రిల్ 8 నుండి 10 వరకు మూడు రోజుల పాటు జరుగనుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి గణాంక నిపుణులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. భారత ప్రభుత్వం గణాంక మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) పరిధిలోని నేషనల్ అకౌంట్స్ డివిజన్ (NAD), నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO), న్యూ ఢిల్లీ సంయుక్తంగా ఈ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నాయి.

నూతన ప్రామాణిక సంవత్సరం (2022-23) ఆధారంగా రాష్ట్ర ఆదాయం అంచనాలు, గణన విధానాలు, డేటా సమీకరణలో మార్పులు, సవరణలపై ఈ వర్క్‌షాప్‌లో సవివరంగా చర్చించనున్నారు. రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపొందించడం, గణాంకాల నాణ్యతను మెరుగుపరచడం ఈ వర్క్‌షాప్ ముఖ్య లక్ష్యాలుగా అధికారులు తెలిపారు.

Tags:    

Similar News