Markapuram: మార్కాపురంలో భక్తి, ఉత్సాహం, గ్రామీణ సంప్రదాయాల సమ్మేళనం!

Markapuram: మార్కాపురం శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 16 రోజుల వేడుకల్లో ఎడ్ల బలప్రదర్శన పోటీలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

Update: 2026-04-08 10:24 GMT

Markapuram: మార్కాపురంలో భక్తి, ఉత్సాహం, గ్రామీణ సంప్రదాయాల సమ్మేళనం!

Markapuram: శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 16 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాల్లో భాగంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలు స్థానిక ఎస్వీకేపీ కళాశాల ప్రాంగణంలో ఘనంగా మొదలయ్యాయి.

మొదటి రోజే ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. మూడు కేటగిరీల్లో నిర్వహిస్తున్న పోటీల్లో ఇవాళ ఆరుపల్ల సైజు ఎడ్లు బండలాగి తమ శక్తిని చాటాయి. ఎడ్ల ప్రతిభను తిలకించేందుకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి సందడి చేశారు.

ఈ పోటీలను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. గెలుపొందిన ఎడ్లకు ఆకర్షణీయమైన బహుమతులు అందించనున్నారు. సాంప్రదాయం, శక్తి, పోటీ స్పూర్తి—all in oneగా మారిన ఈ ఎడ్ల పోటీలు మార్కాపురంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Tags:    

Similar News