Kurnool: ప్రమాదాల నివారణకు సేఫ్టీ ఆడిట్ తప్పనిసరి.. కలెక్టర్ ఆదేశం
Kurnool: కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మంగళవారం కలెక్టరేట్‌లో ఫ్యాక్టరీల భద్రతపై 'డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్' సమావేశం నిర్వహించారు.
Kurnool: ప్రమాదాల నివారణకు సేఫ్టీ ఆడిట్ తప్పనిసరి.. కలెక్టర్ ఆదేశం
కర్నూలు: జిల్లాలో కర్మాగారాల్లో భద్రతకు అవసరమైన చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో కర్మాగారాల్లో చేపట్టాల్సిన భద్రత చర్యలపై సమీక్షించేందుకు ఫ్యాక్టరీస్ శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న కర్మాగారాల్లో ప్రమాదాలు జరగకుండా నిర్దేశిత ప్రమాణాల మేరకు కచ్చితంగా భద్రతా చర్యలు తీసుకోవాలని కర్మాగారాల యాజమాన్యాల ప్రతినిధులను ఆదేశించారు. కర్మాగారాల్లో మాక్ డ్రిల్ లు తరచుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.. ఫైర్,పోలీస్, రెవెన్యూ, వైద్య తదితర అత్యవసర విభాగాలు కూడా ఈ మాక్ డ్రిల్ లో పాల్గొనాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..ప్రమాదకరమైన కర్మాగారాల్లో సబ్ కమిటీ లు ఇచ్చిన నివేదికల మేరకు భద్రతా చర్యలను చెక్ చేయాలని కలెక్టర్ డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ ను ఆదేశించారు.
డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ సభ్యులు కూడా టీమ్ గా వెళ్ళి కర్మాగారాల్లో భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అలాగే కర్మాగారాల్లో భద్రతా చర్యలను సేఫ్టీ ఆడిట్ చేయించాలన్నారు..కర్మాగారాల్లో ప్రమాదాలు జరగకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, ప్రమాదాలు జరిగినపుడు ఎలా స్పందించాలి , టోల్ ఫ్రీ నంబర్ తదితర వివరాలను ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఫ్యాక్టరీల యాజమాన్యాలను ఆదేశించారు.
ఫ్యాక్టరీల విభాగం డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ నారాయణ రెడ్డి జిల్లాలో ఉన్న కర్మాగారాల పరిస్థితి గురించి వివరించారు. టిజివి SRAAC లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, HPCL సంస్థల ప్రతినిధులు కర్మాగారాల్లో చేపట్టిన భద్రత చర్యల గురించి వివరించారు. సమావేశంలో అడిషనల్ మున్సిపల్ కమిషనర్ కృష్ణ, డీఎంహెచ్ వో కామేశ్వర ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ కిషోర్ రెడ్డి, ఇతర సభ్యులు, వివిధ పారిశ్రామిక సంస్థల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.