Nellore: మే నెలలో గృహాల గణన తహసీల్దార్ సమీక్ష

Nellore: మర్రిపాడు మండలంలో మే 1 నుంచి గృహాల గణన సర్వే ప్రారంభం. గణాంకులకు, పర్యవేక్షకులకు నందవరం ఆదర్శ పాఠశాలలో శిక్షణ.

Update: 2026-04-08 07:32 GMT

Nellore: మే నెలలో గృహాల గణన తహసీల్దార్ సమీక్ష

మర్రిపాడు: గృహాల గణన పై ప్రభుత్వం 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సర్వే కార్యక్రమాన్ని మే నెల 1 నుంచి 31వ తేదీ వరకు ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నట్లు ఇంచార్జ్ తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ తెలియజేశారు. అందులో భాగంగా మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని సర్వే చేయాలని అధికారులకు ఆయన సూచించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గణంకులకు, పర్యవేక్షకులకు బ్యాచీల వారీగా నందవరం ఆదర్శ పాఠశాలలో మూడు రోజులపాటు మొదటి బ్యాచ్ కు 9వతేదీ నుంచి 11వ తేదీ వరకు రెండో బ్యాచ్లు 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు,మూడవ బ్యాచ్ కు 21వ తేది నుంచి 23వ తేదీ వరకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. గృహాల సర్వేకు వచ్చిన గణాంకులకు.. గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు సహకరించి వారికి ఇచ్చిన గుర్తింపు కార్డులను, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఇంచార్జ్ తహసీల్దార్ కోరారు.

Tags:    

Similar News