Anantapur: ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ.. సచివాలయంలో ముగ్గురే ఉండటంతో సీరియస్!

Anantapur: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నగరంలోని 74వ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Update: 2026-04-08 09:36 GMT

Anantapur: ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ.. సచివాలయంలో ముగ్గురే ఉండటంతో సీరియస్!

Anantapur: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ మరోసారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని 34వ డివిజన్ పరిధిలోని 74వ సచివాలయాన్ని ఆయన అకస్మాత్తుగా సందర్శించారు.

ఎమ్మెల్యే సచివాలయానికి చేరుకున్న సమయంలో అక్కడ ఉండాల్సిన 10 మంది సిబ్బందిలో కేవలం ముగ్గురు మాత్రమే విధుల్లో కనిపించడం ఆయన ఆగ్రహానికి కారణమైంది. మిగతా సిబ్బంది ఎక్కడ ఉన్నారని ప్రశ్నించగా నలుగురు ఫీల్డ్ విజిట్‌కు వెళ్లారని మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. వెంటనే ఫీల్డ్‌లో ఉన్న సిబ్బందికి ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేసి వారు ఏ పనుల కోసం వెళ్లారో వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం సచివాలయంలో హాజరు శాతం పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన ప్రజా ఫిర్యాదుల వివరాలను పరిశీలించారు. ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు ఎన్ని, వాటిలో ఎన్ని పరిష్కరించారన్న అంశాలపై కూలంకషంగా సమీక్ష నిర్వహించారు.

సచివాలయ సిబ్బంది సమయానికి హాజరై ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. ప్రస్తుతం ప్రతి సచివాలయంలో సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు.

Tags:    

Similar News