Rudrur: చంటిబిడ్డతో మహిళ వ్యాపారం.. కంటతడి పెట్టించే దృశ్యం
Rudrur: బోధన్ డివిజన్ రుద్రూర్ బస్టాండ్ ప్రాంతంలో ఎండల తీవ్రతకు తాళలేక ఓ మహిళ తన చంటిబిడ్డతో కలిసి అత్యంత ప్రమాదకరమైన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ గద్దె కింద నీడ పొందుతూ వ్యాపారం చేస్తోంది.
Rudrur: చంటిబిడ్డతో మహిళ వ్యాపారం.. కంటతడి పెట్టించే దృశ్యం
Rudrur: ఎండల తీరు తరం పెరుగుతున్నప్పటికీ పొట్టకూటి కోసం ఆరాటం తప్పలేదా తల్లికి. బోధన్ డివిజన్ ప్రాంతంలోని రుద్రూర్ లో బుధవారం ఓ మహిళ తన వ్యాపారాన్ని సాగించేందుకు ట్రాన్స్ఫార్మర్ను నీడగా మార్చుకొని వ్యాపారాన్ని సాగించింది. హైదరాబాదు నుండి డ్రమ్ములను విక్రయించేందుకు రుద్రూర్కి వచ్చిన మహిళ చంటి బిడ్డతో మండుటెండలో వీధి వ్యాపారాన్ని సాగించింది.
బస్టాండ్ ప్రాంతంలో నీడవసతి లేకపోవడం తో ప్రమాదం తెలిసిన పొట్టకూటి కోసం వచ్చిన మహిళ ప్రమాదకరమైన ట్రాన్స్ఫార్మర్ గద్దె వద్ద తన బిడ్డను సేద తీరుస్తూ డ్రమ్ము లను విక్రయించింది. నివ్వేర పోయారు. చంటి బిడ్డతోతో వచ్చిన మహిళ దినాస్తిని చూసి సానుభూతి ప్రకటించారు.