Illanthakunta: స్నేహానికి 'సేవ' గుర్తింపు.. 9 ఏళ్లుగా చలివేంద్రం నిర్వహిస్తున్న బాల్య మిత్రుల సేవా సమితి!

జమ్మికుంట జెడ్పీ ఉన్నత పాఠశాల 1983-84 బ్యాచ్ విద్యార్థులు 'బాల్య మిత్రుల సేవా సమితి'గా ఏర్పడి తొమ్మిదేళ్లుగా ఇల్లంతకుంటలో చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వారి సేవా స్ఫూర్తిపై ప్రత్యేక కథనం.

Update: 2026-04-09 05:23 GMT

Illanthakunta: స్నేహానికి 'సేవ' గుర్తింపు.. 9 ఏళ్లుగా చలివేంద్రం నిర్వహిస్తున్న బాల్య మిత్రుల సేవా సమితి!

ఇల్లంతకుంట: కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఇదే విధంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము ముఖ్యంగా మేము 26 12 2016 నాడు బాల్యమిత్రుల సేవా సమితి అని 1983 84 బ్యాచ్ జమ్మికుంట జెడ్పి ఉన్నత పాఠశాల పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు అందరం కలిసి.ఒక.సమూహంగా.ఏర్పడినాము. కరోనా సమయంలో 41 రోజులు ఉదయము అల్పాహారము మాస్కులు సానిటైజర్లు ఉచితంగా పంపిణీ చేశాము అదే స్ఫూర్తితో గత తొమ్మిది సంవత్సరాలుగా ఇల్లంతకుంటలో బాల్య మిత్రుల సేవాసమితి అనగా మా మిత్రుల సహాయ సహకారాలతో చలివేంద్రాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేస్తున్నారు ఇదే విధంగా మునుముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము. దీనిలో రేపెల్లి సంపత్ కుమార్ గుండా సురేందర్ ముకిరాల సంపత్ రావు, హనుమాన్ల కొమురయ్య, మట్టేపల్లి ప్రకాష్.మట్ట వాసుదేవ రెడ్డి, కళ్యాణం రవీందర్ తదితరులు పాల్గొన్నారు

Tags:    

Similar News