LB Nagar: ఆటోనగర్‌లో లారీ యజమానుల ఆందోళన.. ఫిట్‌నెస్ జీవో కాపీ దగ్ధం, ప్రభుత్వానికి అల్టిమేటం!
LB Nagar: ఇసుక లారీ యజమానులకు ఫిట్నెస్ రేడియం స్టిక్కరింగ్ ధరల జీవో కాపీని తగలబెట్టడం జరిగింది.
LB Nagar: ఆటోనగర్‌లో లారీ యజమానుల ఆందోళన.. ఫిట్‌నెస్ జీవో కాపీ దగ్ధం, ప్రభుత్వానికి అల్టిమేటం!
ఎల్బీనగర్: ఇసుక లారీ యజమానులకు ఫిట్నెస్ రేడియం స్టిక్కరింగ్ ధరల జీవో కాపీని తగలబెట్టడం జరిగింది. దానికి విరుద్ధంగా ఆటోనగర్ లో నిరసన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన రవాణా చట్టంలో లారీ యజమానులకు ఆర్థికంగా నష్టపోయే చట్టాలను తొలగించాలి డిమాండ్ చేశారు. వాహనాలకు ఫిట్నెస్ రేడియం స్టిక్కరింగ్ కు ప్రభుత్వం పెంచిన రేట్ల వల్ల లారీ యజమానులు ఆర్థిక భారం పెరగడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు.
రోడ్డు భద్రతా భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఫిట్నెస్ చేయించేటప్పుడు రేడియో స్టిక్కరింగ్ రవాణా శాఖ ఉచితంగా అంటించాలి ప్రభుత్వానికి వాహనదారులు రోడ్ టాక్సీ చెల్లిస్తున్నందువల్ల ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఉచితంగా స్టిక్కరింగ్ వేయాలని అన్నారు. లేనియెడల ప్రభుత్వం పై లారీ యాజమాన్యం ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు.