Harish Rao: హరీష్ రావు హౌస్ అరెస్ట్.. కోకాపేట్ నివాసం వద్ద భారీ పోలీస్ బందోబస్తు!
Harish Rao: మాజీమంత్రి హరీష్‌రావును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో మాజీమంత్రి హరీష్ రావు పర్యటించాల్సి ఉంది.
Harish Rao: హరీష్ రావు హౌస్ అరెస్ట్.. కోకాపేట్ నివాసం వద్ద భారీ పోలీస్ బందోబస్తు!
Harish Rao: మాజీమంత్రి హరీష్‌రావును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో మాజీమంత్రి హరీష్ రావు పర్యటించాల్సి ఉంది. ఇండస్ట్రియల్ పార్క్ పేరిట 12 వందల ఎకరాల భూములను కోల్పోతున్న కళ్లాపూర్, రాపోల్ బాధిత రైతులను ఆయన పరామర్శించి.. బాధిత రైతులతో మాట్లాడే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే.. మాజీమంత్రి హరీష్‌రావు సహా బీఆర్ఎస్ నేతలు పరిగికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ కోకాపేట్‌లో హరీష్‌రావును హౌస్ అరెస్ట్ చేశారు. హరీష్‌రావు నివాసం దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు.. మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నేతలను గృహ నిర్బంధం చేశారు. ఇప్పటికే పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి సహా పలువురు బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేసి బోంరాస్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదిలా ఉంటే.. నిన్న రాత్రి వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ ఎదుట హైడ్రామా నెలకొంది. ఇవాళ రాపోల్, కళ్లాపూర్ గ్రామాలకు మాజీమంత్రి హరీష్ రావు రానున్నారు. కళ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ భూ బాధితులను ఆయన పరామర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి అనుమతి కోరుతూ పోలీస్ స్టేషన్ కు రాపోల్ సర్పంచ్ , గ్రామస్తులు చేరుకున్నారు. అయితే.. హరీష్ రావు పర్యటనకు అనుమతి నిరాకరించారు పోలీసులు. అంతేకాదు.. పర్మిషన్ అడిగేందుకు వచ్చిన రాపోల్ సర్పంచ్ , గ్రామస్తులను నిర్బంధించారు.
ఈ విషయం తెలుసుకున్న కొందరు మహిళలు పెద్దసంఖ్యలో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. భారీ సంఖ్యలో గ్రామస్తులు తరలిరావడంతో పోలీస్ స్టేషన్ గేట్లు మూసేశారు పోలీసులు. గేట్లు తెరవాలంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. మా వారిని బయటకు పంపాలి.. హరీష్ రావు పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ పెద్దఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. దాదాపు గంటసేపు ఉత్కంఠ తర్వాత.. రాపోల్ సర్పంచ్ తో పాటు గ్రామస్తులను పోలీసులు బయటకు పంపారు. తమ వారంతా క్షేమంగా బయటకురావడంతో మహిళలు అక్కడి నుంచి వెనుదిరిగారు. మొత్తానికి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో పరిగిలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.