Cherlapally: ఓయూ నుండి పీహెచ్‌డీ సాధించిన సింధుజ!

Cherlapally: చర్లపల్లికి చెందిన సింధుజ ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఫార్మసీలో పీహెచ్‌డీ సాధించారు.

Update: 2026-04-06 10:12 GMT

Cherlapally: ఓయూ నుండి పీహెచ్‌డీ సాధించిన సింధుజ!

Cherlapally: చర్లపల్లి డివిజన్‌కు చెందిన గుడిపల్లి–పెరుమాళ్ల సింధుజకు ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఫార్మసీ (Pharma) విభాగంలో PhD పూర్తి చేసి డాక్టరేట్ పట్టా సాధించిన సందర్భంగా బొంతు శ్రీదేవి యాదవ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ మాట్లాడుతూ, ఉస్మానియా యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో ఉన్నత విద్యను అభ్యసించి, భర్త ప్రణీత్ కుమార్ ప్రోత్సాహం స్వయంకృషితో డాక్టరేట్ సాధించడం చర్లపల్లి డివిజన్‌కు గర్వకారణమని పేర్కొన్నారు.

ప్రత్యేకంగా మహిళలు విద్యలో, పరిశోధనలో ముందుకు రావడం సమాజ అభివృద్ధికి ఎంతో ముఖ్యమని, డా. సింధుజ సాధించిన ఈ విజయాన్ని ప్రతి యువతి స్ఫూర్తిగా తీసుకోవాలని శ్రీదేవి సూచించారు. కుటుంబ సహకారం, పట్టుదల, కృషి ఉంటే ఎలాంటి ఉన్నత లక్ష్యాన్నైనా సాధించవచ్చని తెలిపారు.

చర్లపల్లి ప్రాంతం నుండి డాక్టరేట్ స్థాయి వరకు చేరుకోవడం నిజంగా అభినందనీయమని, ఆమె మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భవిష్యత్తులో పరిశోధన రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:    

Similar News